బిగ్ బాస్ షోకి వెళితే కెరీర్ నాశనం... మాజీ కంటెస్టెంట్ నోయల్ తీవ్ర ఆరోపణలు!

First Published | Feb 12, 2024, 3:22 PM IST

బిగ్ బాస్ షోపై మాజీ కంటెస్టెంట్ నోయల్ సంచలన కామెంట్స్ చేస్తాడు. ఆ షోకి వెళ్లిన వాళ్ళ జీవితాలు నాశనం అంటూ ఫైర్ అయ్యాడు. నోయల్ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 


సింగర్ నోయల్ బిగ్ బాస్ తెలుగు 4లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇతడు హౌస్లో చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేవాడు. ఇతరులతో గొడవల పడ్డ సందర్భాలు తక్కువ. అయితే ఒక బి బ్యాచ్ తో సన్నిహితంగా ఉండేవాడు. 

Bigg Boss

అభిజీత్, లాస్య, హారిక అలేఖ్యలతో ఎక్కువగా గడిపేవాడు. వీరిది ఒక బ్యాచ్ అని చెప్పొచ్చు. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టిన నోయల్ అనూహ్యంగా బయటకు వచ్చాడు. నోయల్ అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ షోని వీడాడు. 
 


వస్తూ వస్తూ జబర్దస్త్ అవినాష్ మీద ఆరోపణలు చేశాడు. అందరినీ ఇమిటేట్ చేస్తూ ఎగతాళి చేశావు. అది ఎంతగా బాధించిందో తెలుసా అని అవినాష్ పై మండిపడ్డాడు. హౌస్లో అవినాష్ కామెడీని ఎంజాయ్ చేసిన నోయల్... బయటకు వచ్చే రోజు అతని ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడాడు. 

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షో పై నోయల్ సంచలన ఆరోపణలు చేశాడు. అది ఒక చెత్త షోగా అభివర్ణించాడు. నోయల్ మాట్లాడుతూ... బిగ్ బాస్ గొడవలు పడే షో. అక్కడ హీరో అవ్వాలంటే ఒకరిని తొక్కాలి. ఒకరిని తొక్కేవాడు హీరో ఎలా అవుతాడు. 
 

ఒకరు చెడ్డవాడు అయితే వాడి కర్మన వాడే పోతాడు. మనకు ఎందుకు?. హౌస్లో నుండి బయటకు పంపేందుకు నామినేట్ చేయాలి. అందుకు బలమైన కారణం ఉంటుందా? అంటే ఉండదు. నువ్వు పప్పు వండలేదు అందుకే నామినేట్ చేస్తున్నా వంటి సిల్లీ రీజన్స్ చెప్పాలి. 
 

బిగ్ బాస్ షోలో ఆఫర్ వస్తే రాజమౌళి సినిమాలో ఆఫర్ లా ఎందుకు ఫీల్ అవుతున్నారు. రాజమౌళి సినిమాతో బిగ్ బాస్ షోకి పోలికా? రాజమౌళి సినిమాలో నటుడిని ఏళ్ల తరబడి జనాలు గుర్తు పెట్టుకుంటారు. అంత మంచిగా ఆయన చూపిస్తారు. బిగ్ బాస్ షో మాత్రం ఒకరిని చెడ్డగా చూపిస్తుంది. ఆ బొక్కలో షోతో రాజమౌళి సినిమా ఆఫర్ తో సమానం ఎలా అవుతుంది?

బిగ్ బాస్ హౌస్లో వంద రోజులు ఉంచి ఒకరి వ్యక్తిత్వం బయటపెట్టేస్తారు. ఒకరి గురించి పూర్తిగా తెలిశాక వాళ్ళను జనాలు అభిమానించడం చాలా కష్టం. అందుకే బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చిన వాళ్లకు కెరీర్ ఉండదు... అని నోయల్ చెప్పుకొచ్చాడు. 

Latest Videos

click me!