చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది మొదలైన అతిపెద్ద సంచలనం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది హను మాన్ చిత్రం గురించే. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోల చిత్రాల మధ్య కనీసం పోటీని తట్టుకుంటుందా అనే స్టేజీ నుంచి ఇంత అఖండ విజయం సాధించింది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో తప్పకుండా హను మాన్ టాప్ 5 లో ఉంటుందని అంటున్నారు.