ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ ఏడో వారం అనూహ్యంగా మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణింకఠ బిగ్ బాస్ హౌస్ ను వీడి బయటకు వచ్చేశాడు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. మణికంఠ ఎిమినేషన్ ఫెయిర్ గా జరిగిందా లేదా అనే విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకుంటే ఈ వారం ఓటింగ్ లో మణికంఠ ముందున్నాడు. అందరికంటే టేస్టీ తేజ ఓటింగ్ లో వెనుకబడి ఉన్నాడు. దాంతో ఈ వారం టేస్టీ తేజ్ ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కాని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి. మణికంఠను బయటకు పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఇలా చేయడానికి కారణం ఏంటో అర్ధం కావడంలేదు. వీకెండ్ ఎపిసోడ్ లో నాకు ఈ గేమ్ అవ్వడంలేదు.. అన్నాడు మణికంఠ.