పట్టుచీర కట్టి, ఒంటినిండా బంగారం ధరించి పిచ్చెక్కిస్తున్న సిరి.. ఆమె నడుముపై చిలిపి కామెంట్లు

Published : Mar 23, 2023, 08:16 PM IST

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది సిరి. ఆ తర్వాత ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ఇంటర్నెట్‌లో తరచూ హంగామా చేస్తుంది. అయితే ఇటీవల గ్లామర్‌ ఫోటో షూట్లతోనూ కట్టిపడేస్తుందీ అందాల భామ.   

PREV
18
పట్టుచీర కట్టి, ఒంటినిండా బంగారం ధరించి పిచ్చెక్కిస్తున్న సిరి.. ఆమె నడుముపై చిలిపి కామెంట్లు

బిగ్‌ బాస్‌ సిరి.. తాజాగా చీరలో మెరిసిపోతుంది. ఒంటినిండా నగలు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. మరోవైపు పర్పుల్‌ కలర్‌ శారీ కట్టి హోయలు పోయింది. డిఫరెంట్ లుక్స్ లో, నయా అందాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 
 

28

ఇక ఇందులో సిరి క్యూట్‌నెస్‌ కాస్త హాట్‌గా మారిపోయింది. ఆమె చిలిపి పోజులు కాస్త ఘాటుగా మారాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఇందులో తన పెట్‌ డాగ్స్ తో కలిసి ఆమె పోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. అయితే ఇదంతా ఓ దుస్తుల బ్రాండ్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి పోజులివ్వడం విశేషం. 
 

38

సిరి గ్లామర్‌ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. `మేం ఏం చేశామండి ఇంతటి అందంతో చంపేస్తున్నారని, ఈ శారీలో ఏంజెల్‌లా ఉన్నావని అంటున్నారు. మరికొందరు హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. ఈ చీరలో మీ నడుము చాలా బాగుందని, ఇంత అందంగా ఎలా పుట్టారండి బాబూ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చీరలో బార్బీ డాల్‌లా ఉన్నావని కొందరు, చీరలో నవ్వులో క్యూట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అని ఇంకొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తంగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

48

సిరి యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ 5 ఈ అమ్మడికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ సీజన్‌లో చాలా మెచ్యూర్డ్ గా ఉంది. అందరితో కలివిడిగా ఉంటూనే షణ్ముఖ్‌తో మరింత ఫ్రెండ్లీగా మూవ్‌ అయ్యింది. అయితే షణ్ముఖ్‌ కారణంగానే చాలా ఇబ్బంది పడింది. 
 

58

అయితే సిరి కారణంగానే షణ్ముఖ్‌, దీప్తి సునైనా విడిపోయారనే టాక్‌ నడిచింది. నిజానికి ఆమెకి ఏమాత్రం సంబంధం లేదనేది ఆమె అభిమానుల వాదన. నిజానికి షోలో సిరి ఎక్కడ తన లిమిట్స్ దాటలేదు, పైగా గేమ్‌ పరంగానూ ఓపులిలా ఆడింది. బలమైన కంటెస్టెంట్లని అంతే డేర్‌గా ఎదుర్కొని హైలైట్‌గా నిలిచింది. 
 

68

ఇక ఫ్యామిలీ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది సిరి. ఆమె అంతకు ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అతను హఠాన్మరణం చెందారు. దీని కారణంగానే ఎంతో కుమిలిపోయింది సిరి. దాన్నుంచి బయటపడటంలో శ్రీహాన్‌ ఎంతో కీలక పాత్ర పోషించారు. 

78

ప్రస్తుతం మరో యూట్యూబ్‌ స్టార్‌, నటుడు శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే శ్రీహాన్‌ బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని ఆల్మోస్ట్ విన్నర్‌గా నిలిచాడు. 
 

88

ఇక సిరి ప్రస్తుతం నటిగా, యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె ఓ షోకి యాంకర్‌గా చేస్తుంది. అడపాదపా యాంకరింగ్‌ చేస్తూ రాణిస్తుంది. దీంతోపాటు `ఆహా`లో బీఎఫ్‌ఎఫ్‌ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. సినిమాల్లోనూ నటిస్తుంది. ఇప్పుడిప్పుడే నటిగా బిజీ అవుతుందీ అందాల భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories