జడ్జిలకు చిరాకు తెప్పించిన కంటెస్టెంట్
శ్రీకాకుళం కు చెందిన రవి, గ్రూప్ టాస్క్‌లలో డామినేట్ చేయడం, ఇతరులను అణచివేయడం ద్వారా ముందుకు వచ్చాడు. అయితే, ఒక టాస్క్ లో యాంకర్ శ్రీముఖి, అతనిని చీర కట్టి హై హీల్స్ వేసుకుని, "అమ్మాయిలు గొప్పవాళ్లు" అని చెప్పాలని కోరింది. అందుకు రవి స్పందన, "టాస్క్ కోసం చెప్తాను కానీ, నా దృష్టిలో మగవాళ్లే గొప్ప" అని అన్నాడు. .ఈ వ్యాఖ్యలపై న్యాయనిర్ణేత బిందు మాధవి తీవ్రంగా స్పందించి, "ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో" అంటూ రెడ్ ఫ్లాగ్ చూపించారు. తర్వాత రవి తన అభిప్రాయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ, "ఆడవాళ్లు అరగంట సేపు బిడ్డకు జన్మనిస్తారు, కానీ మగవాళ్లు జీవితాంతం బాధలతో పోరాడతారు" అనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో న్యాయనిర్ణేతలతో పాటు శ్రీముఖి కూడా తీవ్ర అసహనానికి లోనయ్యారు.