సన్నీ లియోన్ చిత్రానికి తమన్నా సీక్వెల్.. ఇది మాత్రం బోల్డ్ డెసిషన్ ?

Published : Aug 23, 2025, 09:14 AM IST

తమన్నా త్వరలో బాలీవుడ్ లో ఒక సంచలన చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సన్నీ లియోన్ నటించిన చిత్రానికి సీక్వెల్ చేసేందుకు తమన్నా అంగీకరించినట్లు తెలుస్తోంది. 

PREV
15
సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్న తమన్నా

తన అందం, నటనతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. చాలా కాలం పాటు తమన్నా సౌత్ లో తిరుగులేని విధంగా దూసుకుపోయింది. ఇప్పటికీ తమన్నాకి అవకాశాలు వస్తున్నాయి కానీ ఆమె వైవిధ్యమైన పాత్రలని మాత్రమే ఎంచుకుంటోంది. అదే విధంగా వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తోంది. చివరగా తమన్నా ఓదెల 2 చిత్రంలో నటించింది.

DID YOU KNOW ?
హ్యాపీడేస్ చిత్రంతో తమన్నాకి గుర్తింపు
తమన్నా కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం హ్యాపీ డేస్. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో తమన్నా నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
25
బోల్డ్ గా నటించేందుకు రెడీ

తనకు ప్రాధాన్యత ఉంటే బోల్డ్ పాత్రలకి సైతం తమన్నా ఓకె చెబుతోంది. జీకర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లే అందుకు ఉదాహరణ. ఈ వెబ్ సిరీస్ లలో తమన్నా ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా మరో బోల్డ్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం చేయబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

35
త్వరలో రాగిణి ఎంఎంఎస్ 3

బాలీవుడ్ లో రాగిణి ఎంఎంఎస్ ప్రాంఛైజీకి మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రాంఛైజీలో ఇప్పటి వరకు రాగిణి ఎంఎంఎస్, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రాలు వచ్చాయి. నిర్మాత ఏక్తా కపూర్ ఈ సిరీస్ లో మరో సీక్వెల్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఆమె రాగిణి ఎంఎంఎస్ 3 కోసం తమన్నాని సంప్రదించినట్లు తెలుస్తోంది.

45
రాగిణి ఎంఎంఎస్ 3లో తమన్నా ?

ఏక్తా కపూర్ తమన్నాతో రాగిణి ఎంఎంఎస్ 3 స్టోరీ ఐడియా పంచుకున్నారట. ఈ చిత్రంలో హర్రర్ ఎలిమెంట్స్ తమన్నాకి బాగా నచ్చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ చిత్రంలో బోల్డ్ రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించాల్సి ఉంటుంది. దానికి కూడా తమన్నా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. సన్నీ లియోన్ నటించిన రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం సంచలనం సృష్టించింది.

55
సన్నీ లియోన్ సృష్టించిన సంచలనం

సన్నీలియోన్ మించేలా తమన్నా గ్లామర్ తో ఆకట్టుకుంటుందా అని అప్పుడే ఫ్యాన్స్ మధ్య చర్చలు మొదలయ్యాయి. రాగిణి ఎంఎంఎస్ 2లో బేబీ డాల్ సాంగ్, సన్నీ లియోన్ పెర్ఫార్మెన్స్ గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు కాబట్టి తమన్నా రాగిణి ఎంఎంఎస్ 3లో నటిస్తే మరో సంచలనం కావడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories