బాబోయ్ అబ్బాయిలతో శ్రీముఖి డబుల్ మీనింగ్ కామెంట్స్ విన్నారా.. ఏడ్చేసిన వరంగల్ అమ్మాయి

Published : Aug 23, 2025, 01:07 PM IST

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జడ్జీలకు, పార్టిసిపెంట్స్ కి మధ్య సరదా సంభాషణలు జరుగుతున్నాయి. కొన్ని ఫన్నీ కామెంట్స్ డబుల్ మీనింగ్ గా మారి వైరల్ అవుతున్నాయి. 

PREV
15
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో పాల్గొనే కామనర్స్ ఎంపిక కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రీ షో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి.. న్యాయనిర్ణేతలుగా నవదీప్, అభిజీత్, బిందుమాధవి వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి జడ్జీలు తమదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తారు. చిన్న చిన్న టాస్క్ లు ఇస్తారు. దానిని బట్టి వాళ్ళని ఎంపిక చేసే విధానం ఉంటుంది. 

25
శ్రీముఖి డబుల్ మీనింగ్ కామెంట్స్ 

తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. జడ్జీలు, పార్టిసిపెంట్స్ కి మధ్య ఫన్నీ సంభాషణలు జరుగుతున్నాయి. మధ్యలో శ్రీముఖి అయితే ఏకంగా డబుల్ మీనింగ్ డైలాగులతో రచ్చ చేస్తోంది. ఓ అబ్బాయి వేదికపైకి రాగానే నీకు బలం బాగా ఉందా అని శ్రీముఖి అడుగుతుంది. ఉంది అని అతడు సమాధానం ఇస్తాడు. దేన్నైనా మోయగలవా అని శ్రీముఖి అడుగుతుంది. దీనితో అతడు ఆమె వంక విచిత్రంగా చూస్తాడు. శ్రీముఖి సిగ్గు పడుతూ నన్ను కాదయ్యా అని బదులివ్వడం నవ్వులు పూయిస్తోంది. 

35
నవదీప్ ఫన్నీ కామెంట్స్ 

మరో అబ్బాయిని శ్రీముఖి పెళ్లయిందా అని అడుగుతుంది. అయింది అని అతడు సమాధానం ఇస్తాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అని శ్రీముఖి అడుగుతుంది. ఆమె డబుల్ మీనింగ్ తో అడగడంతో జడ్జీలు కూడా నవ్వేశారు. తనకు కూడా పెళ్లి విషయంలో అదే డౌట్ ఉందని నవదీప్ అన్నారు. 

45
నేను ఆడ నవదీప్‌⁠ని..  

ఆ తర్వాత ఓ అమ్మాయి వేదికపైకి వస్తుంది. జడ్జీగా ఉన్న బిందుమాధవి నీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని ఆమెని అడుగుతుంది. నేను ఆడ నవదీప్ అని అని ఆమె బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. తాను సింగిల్ కాదని కానీ పైకి మాత్రం సింగిల్ లాగా నటిస్తానని ఆ అమ్మాయి సమాధానం ఇవ్వడం విశేషం. 

55
ఏడ్చేసిన వరంగల్ అమ్మాయి 

ఇక వరంగల్ అమ్మాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ అనూష రత్నం కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొంటున్నారు. జడ్జీలతో అనూష మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకుని ఏడ్చేసింది. తన తండ్రి మద్యం, సిగరెట్ అలవాటు వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గతంలోనే అనూష సోషల్ మీడియాలో తెలిపింది. 

Read more Photos on
click me!

Recommended Stories