మనీష్ కు అభిజీత్ టెస్ట్
అభిజీత్ అతనిని ప్రశ్నిస్తూ, ‘‘ఇలాంటి ప్రొఫైల్ ఉన్న మీరు బిగ్ బాస్‌లో ఎందుకు పాల్గొంటున్నారు?’’ అని అడిగాడు. దానికి మనీష్ సమాధానం, ‘‘బిగ్ బాస్ గేమ్ అంటే నాకు ఇష్టం. తెలివైన వ్యూహాలతో గేమ్ ఆడేలా చూపించాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాడు. అతని సమాధానంతో నవదీప్ , బిందు మాధవి రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. కానీ అభిజీత్ మాత్రం ఓ ఆసక్తికరమైన టెస్ట్ పెట్టాడు. ఒక తెల్ల చార్ట్ పై బొమ్మ గీయమని చెప్పిన అభిజీత్, బొమ్మ గీసిన తర్వాత ‘‘ఇది రెడ్ ఫ్లాగ్ ఇవ్వకుండా ఉండాలంటే, ముఖభాగంపై నా చేతిలో ఉన్న రెడ్ మార్కర్ పడకూడదు’’ అన్నాడు.అప్పుడు మనీష్ తన తెలివితేటలతో తల భాగాన్ని బొమ్మలో తొలగించి వేసాడు. ‘‘తల లేకపోతే మీరు రెడ్ మార్క్ వేసే అవకాశం లేదు కదా’’ అని చెప్పాడు.