నట సింహం, టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తాజాగా 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన 'సూపర్ సిక్స్' సభలో పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ, ‘‘ఈ సభకు బాలయ్యగారు, నారా లోకేష్ రావాల్సింది. అయితే బాలకృష్ణ కాస్త అనారోగ్యంతో ఉన్న కారణంగా సభకు రాలేకపోయారు,’’ అని ప్రకటించారు.