సెట్‌లో ఎన్టీఆర్‌.. లేట్‌గా వచ్చిన శ్రీదేవి.. ఫస్ట్ టైమ్‌ రాఘవేంద్రరావులో కోపం.. అసలేం జరిగిందంటే?

First Published Apr 16, 2024, 2:38 PM IST

రాఘవేంద్రరావు అంటూ మిస్టర్‌ కూల్‌ డైరెక్టర్‌గా పేరుంది. కానీ ఆయనలో కోపం ఉందట. అది మొదటిసారి శ్రీదేవి చూసిందట. ఆ షాకింగ్ సంఘటనని పంచుకుంది అతిలోక సుందరి. 

ఎన్టీఆర్‌, శ్రీదేవి పెయిర్‌ అప్పట్లో హిట్‌ పెయిర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌కి మనవరాలిగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్‌గానూ చేసింది. `వేటగాడు` సినిమాలో ఈ ఇద్దరి మ్యాజిక్‌ వర్కౌట్‌ అయి సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌, శ్రీదేవి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. మంచి విజయాలు సాధించాయి. 
 

అయితే తాజాగా `వేటగాడు` సినిమా షూటింగ్‌ టైమ్‌లో చోటు చేసుకున్న సంఘటనని పంచుకున్నారు అతిలోక సుందరి శ్రీదేవి. మొదటి సారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులో కోపం చూసినట్టు తెలిపారు. ఆ సమయంలో జరిగిన సంఘటన గురించి పంచుకున్నారు. 
 

`వేటగాడు` సినిమా షూటింగ్‌ జరుగుతుందట. ఎన్టీఆర్‌తో పాటని చిత్రీకరిస్తున్నారు. `జాబిలితో చెప్పనా` అనే పాటని చిత్రీకరిస్తున్నారట. ఊటిలోని బొటానికల్‌ గార్డెన్‌లో షూటింగ్‌. మార్నింగ్‌ 7గంటలకు షార్ప్ గా రావాలి. ఫ్రెష్‌గా షూట్‌ చేయాలని రాఘవేంద్రరావు ప్లాన్‌ చేశారట. ముందు రోజే ఆ విషయం చెప్పారట. అన్నట్టుగానే రామారావు ముందే వచ్చి సెట్‌లో ఉన్నాడు. షూటింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. 
 

కానీ శ్రీదేవి రాలేదు. ఆమెకి లేట్‌ అయ్యింది. తనకు హాస్టల్‌లో ఏదో సమస్య వచ్చి తనకు రావడానికి ఆలస్యమైందట. అప్పటికీ గబగబా వచ్చేస్తుందట. తాను అంబాసిడర్‌ కార్‌లో వస్తుందట. అయితే తాను రాకపోవడంతో ఇంకా రాలేదేంటి అని రాఘవేంద్రరావు ఆవేశంతో తన కోసం బయలు దేరాడట. షూటింగ్‌ సెట్‌ నుంచి రాఘవేంద్రరావు కూడా తెల్లటి అంబాసిడర్‌ కారులో బయలు దేరారు. 
 

తనకారు, రాఘవేంద్రరావు కారు ఎదురుపడ్డాయి. విండో లో నుంచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ సమయంలో దర్శకేంద్రుడులోని కోపం మొదటి సారి చూసిందట శ్రీదేవి. పళ్లు బిగించి `నీ.. అంటూ చేయి చూపిస్తూ ఫైర్‌ అయ్యాడట రాఘవేంద్రరావు. ఆయనలో కోపం చూడటం అదే మొదటిసారి అని, ఎంతో గాబర పడిపోయానని, ఏం జరుగుతుందో, ఏమో అంటూ టెన్షన్‌ పడిపోయిందట. ఆ తర్వాత రాఘవేంద్రరావు ఏం అనలేదని, కూల్‌గా సాగిపోయిందని, ఆయన కోప్పడటం అదే మొదటిసారి అని చెప్పింది శ్రీదేవి. 
 

రాఘవేంద్రరావు నిర్వహించే `సౌందర్య లహరి` కార్యక్రమంలో పాల్గొన్న అతిలోక సుందరి శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించింది. రాఘవేంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని, సెట్‌లో తాము చేసే పనులను ఆయన ఎంజాయ్‌ చేస్తారని, కూల్‌గా ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారని చెప్పింది శ్రీదేవి. అంతేకాదు హీరోయిన్‌గా తనకు లైఫ్‌ ఇచ్చింది ఆయనే అని, `వేటగాడు` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చాడని తెలిపింది శ్రీదేవి. 
 

అయితే ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్‌తో బాలనటిగా చేసింది శ్రీదేవి. మనవరాలిగానూ నటించింది. అలాంటిది 14ఏళ్ల వయసున్న శ్రీదేవిని ఎన్టీఆర్‌కి జోడీ అంటే అందరు ఏమనుకుంటారు, ముందు ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా? అనే సందేహం ఉండేదట. బెరుకు బెరుకుగా ఆయన వద్ద ఈ విషయాన్ని చెప్పారట. అయితే ఏం చేసేద్దామని, తనకి 14ఏళ్లే అని చెప్పగా, నాక్కూడా 14ఏళ్లే అంటూ ఛమత్కరించి దర్శకుడిని ఫ్రీ చేశాడని తెలిపారు రాఘవేంద్రరావు. 

click me!