వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ, కన్నీరు పెట్టుకున్న రవి.. లోబో ఎలిమినేటెడ్, ఆపై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన నాగ్

First Published | Oct 16, 2021, 11:01 PM IST

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ అనీ మాస్టర్, జైల్లో ఉన్న శ్వేతా మధ్య సంభాషణతో మొదలవుతుంది. ఇంట్లో విషయాల గురించి వారిద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు.

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ అనీ మాస్టర్, జైల్లో ఉన్న శ్వేతా మధ్య సంభాషణతో మొదలవుతుంది. ఇంట్లో విషయాల గురించి వారిద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు. వెంటనే శ్వేతా జైలు శిక్ష పూర్తయినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో నాగార్జున సమావేశం మొదలవుతుంది. రెండవసారి కెప్టెన్ అయిన విశ్వని నాగార్జున అభినందిస్తారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. టెడ్డి  బేర్ టాస్క్ గురించి నాగార్జున ఒక్కొక్కరికి క్లాస్ పీకడం మొదలు పెడతారు. 

మొదటగా Nagarjuna లోబోకి గట్టి వార్నింగ్ ఇస్తారు. Bigg Boss 5 Telugu హౌస్  లో ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ పిల్లోస్ నుంచి కాటన్ తీసుకోవడంపై నాగార్జున ఫైర్ అవుతారు. దీనికి లోబో.. రవి చెబితే చేశాను అని అంటాడు. రవి గడ్డి తినమంటే తింటావా అంటూ నాగార్జున లోబోకి కౌంటర్ ఇస్తాడు. సిరి, అనీ మాస్టర్ మధ్య జరిగిన గొడవ గురించి కూడా నాగార్జున ఇద్దరికీ క్లాస్ పీకుతాడు. ఈ గొడవకు అసలు కారణమైన రవి వంతు వస్తుంది. ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యేలా రవి తన టీం ని ప్రోత్సాహించాడని నాగ్ తప్పు పడతారు. రవి చేసింది రైటా రాంగా అని నాగ్ ఇంటి సభ్యుల ఒపీనియన్ అడుగుతారు. అందరూ రవిదే తప్పు అని తేల్చేస్తారు. 


ఆ తర్వాత ఆసక్తికర సంఘటన మొదలవుతుంది. నాగ్ ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు. మొదటగా Manas కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాడు. ఇంట్లో ఉండడానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని నాగ్ ప్రశ్నిస్తాడు. దీనిని మానస్.. శ్రీరామ్ పేరు చెబుతాడు. అతడు ఎక్కువ ఎమోషల్ అవుతాడు అని మానస్ చెబుతాడు. ఇలా ఒక్కొక్కరిని పిలిచి అడగగా ఎక్కువమంది సభ్యులు ప్రియా, లోబో పేర్లు చెబుతారు. నలుగురు సభ్యులు ప్రియా ఇంట్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తిగా, నలుగురు సభ్యులు లోబో అర్హత లేని వ్యక్తిగా నాగ్ కి చెబుతారు. ఇందంతా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సీక్రెట్ గా జరుగుతుంది. 

అత్యధిక ఓట్లు వచ్చిన ప్రియా, Lobo లలో ఒకరు Eliminate అవుతారని, ఇది బ్రేకింగ్ న్యూస్ అని నాగార్జున చెబుతారు. ఒకరిని ఎలిమినేట్ చేసి మరొకరిని సేవ్ చేసే అవకాశం ఇంటి సభ్యులదే అని నాగ్ చెబుతారు. ప్రియా హౌస్ లో ఉండాలనుకునే వారు ఆమె పక్కన.. లోబో హౌస్ లో కొనసాగాలనుకునేవారు అతడి పక్కన నిలబడాలనినాగ్ ఇంటి సభ్యులని ఆదేశిస్తాడు. ఎక్కువమంది ప్రియా వైపే నిలబడతారు. శ్రీరామ్, అనీ ఎటూ తేల్చులేక చివరకు ప్రియా వైపే నిలబడతారు. దీనితో ప్రియా సేవ్ అవుతుంది..లోబో ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటిస్తారు. ఈ సంఘటన మొత్తం ఇంటి సభ్యులకు ఊహించని షాక్ లా మారిపోతుంది. 

లోబో ఎలిమినేట్ కావడాన్ని విశ్వ జీర్ణించుకోలేకపోతాడు. దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తాడు. తప్పు చేసే వాళ్ళు మాత్రం హౌస్ లో ఉంటారు అంటూ అసహనం వ్యక్తం చేస్తారు. మిగిలిన ఇంటి సభ్యులంతా షాక్ లో సైలెంట్ గా అయిపోతారు. ఇన్ని రోజులు లోబోతో క్లోజ్ గా ఉండడంతో రవి ముఖంలో కూడా దుఃఖం కనిపిస్తుంది. 

భావోద్వేగాల నడుమ లోబో అందరిని పలకరిస్తూ బిగ్ బాస్ హౌస్ ని విడచి నాగ్ వద్దకు వెళతాడు. హౌస్ లో ఎవరికీ థమ్స్ అప్ ఎవరికి థమ్స్ డౌన్ అని అడగగా లోబో అందరికి థమ్స్ అప్ ఇస్తాడు. Ravi నా ఫ్రెండ్, స్నేహానికి విలువ ఇస్తాను అని లోబో చెప్పడంతో రవి కన్నీరు పెట్టుకుంటాడు. 

ఇక అందరికి బై చెప్పి బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు లోబో. నాగ్ కూడా ఇంటి సభ్యులకు టాటా చెప్పి టివి స్క్రీన్ ఆఫ్ చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. బిగ్ బాస్ విడచి లోబో వెళుతుండగా నాగ్ అతడిని వెనక్కి పిలుస్తాడు. హౌస్ లో కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే హక్కు ప్రేక్షకులకు తప్ప బిగ్ బాస్ కి, నాకు కూడా లేదు. లాంటిది హౌస్ మేట్స్ నిన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారు. నువ్వు ఎలిమినేట్ కాలేదు అని లోబోకి చెబుతాడు.

దీనితో లోబో సంతోషంతో మరోసారి భావోద్వేగానికి గురవుతాడు. అయితే హౌస్ మేట్స్ ఎవరికీ ఈ విషయం తెలియదు. వారంతా లోబో ఎలిమినేట్ అయ్యాడనే అనుకుంటుంటారు. కొన్నిరోజుల పాటు నిన్ను సీక్రెట్ రూమ్ లో ఉంచుతామని..మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యేది బిగ్ బాస్ చెబుతారని నాగ్ అంటారు. దీనితో లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. 

Also Read: దీపికాని మోసం చేయడంపై రణబీర్ బోల్డ్ స్టేట్మెంట్.. ఆమెకు టెంప్ట్ అయ్యాను అంటూ..

Latest Videos

click me!