బిగ్‌ బాస్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్? కొత్త రూల్స్‌తో వినోదం తగ్గనుందా..?

First Published Aug 12, 2020, 11:40 AM IST

తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్‌ షో బిగ్ బాస్‌ సీజన్‌ 4 త్వరలో ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో అనుమానాలు అవాంతరాల తరువాత బిగ్‌ బాస్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. చాలా రోజులుగా సరైన వినోదం కోసం ఎదురుచూస్తున్న అభిమానులను బిగ్ బాస్‌ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

అంతర్జాతీయ స్థాయిలో సూపర్‌ హిట్‌ అయిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇండియాలోనూ ఈ షో సంచలనాలు నమోదు చేసింది. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్‌ లాంగ్వేజెస్‌లోనూ బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌ బాస్‌ త్వరలో 4వ సీజన్‌ ప్రారంభం కానుంది.
undefined
కరోనా నేపథ్యంలో అసలు షో ఉంటుందా లేదా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు నిర్వహకులు. ఇక షో హోస్ట్‌కు సంబంధించిన గాసిప్స్‌ కూడా ఫుల్‌ స్టాప్‌ పెడుతూ నాగార్జున షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఇప్పటికే నాగార్జున ప్రోమో షూట్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కూడా డేట్‌ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
undefined
ఇప్పటికే 30 మంది కంటెస్టెంట్‌లను సెలెక్ట్ చేసి వారికి కరోనా పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది. వారిలో 16 మంది కంటెస్టెంట్‌లు షోలో పాల్గొననున్నారు. ఈ లిస్ట్‌ లో పూనమ్‌ బాజ్వా, నోయల్, నందు, మంగ్లీ, ప్రియా వడ్లమాని, మహాతల్లి లాంటి వారి పేర్లు వినిపిస్తున్నా.. నిర్వాహకులు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
undefined
మరో వైపు కరోనా కారణంగా షో నిర్వహించే రోజులు కూడా కుదిస్తారన్న ప్రచారం జరిగినా అదేమీ లేదని తెలుస్తోంది. సీజన్‌ 4, 16 మంది కంటెస్టెంట్‌లతో 106 రోజుల పాటు నిర్వహించాలని ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టాస్క్‌లు, షో నిర్వహణలో మాత్రం కీలక మార్పులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
undefined
ముఖ్యంగా గత సీజన్లలో పంపినట్టుగా కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపటం, బయటవారు దొంగళ్ల, లేదా ఇలా పనుల మీద హౌస్‌లోకి వెళ్లటం లాంటి టాస్క్‌ లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో నాగార్జున హోస్ట్ చేసే ఎపిసోడ్స్‌ లో కూడా గతంలోలా ఆడియన్స్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
undefined
ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ నెల 30న షోను ప్రారంభించాలని నిర్వహకులు భావిస్తున్నారు. ఆగస్టు 29న నాగ్ బర్త్‌ డే కూడా కావటంతో 29, లేదా 30లలో ఏ రోజు ప్రారంభించాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
undefined
click me!