సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ వెల్లడిస్తున్న ప్రకారం, ‘ఓజీ’ 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.