బిగ్ బాస్ హౌస్ నుంచి నైనికా అవుట్..డబుల్ ఎలిమినేషన్ కావడంతో తప్పలేదు..

First Published | Oct 5, 2024, 9:43 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ అన్నట్లుగా సాగుతోంది. ఎలిమినేషన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, భావోద్వేగాలు కూడా ఊహకి అందడం లేదు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ అన్నట్లుగా సాగుతోంది. ఎలిమినేషన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, భావోద్వేగాలు కూడా ఊహకి అందడం లేదు. అంతగా గుర్తింపు లేని సెలెబ్రిటీలు ఉన్నప్పటికీ హౌస్ లో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. 

కాగా ఎలిమినేషన్ లో భాగంగా ఆదివారం రోజు మరో షాక్ తగలబోతోంది. నైనికా అనసూరు బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఎలిమినేట్ అయింది. ఆల్రెడీ ఈ వారం మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్ లో నైనికని ఎలిమినేట్ చేసి డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చారు. నైనికా ఢీ లాంటి షోలలో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. 


హౌస్ లో ఆమె 34 రోజులు సర్వైవ్ అయింది. కానీ ఇతర సభ్యులకు పోటీ ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో ఆమె ఎలిమినేషన్ తప్పలేదు.  నిఖిల్, నబీల్, మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనికా ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. ఆదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. కాబట్టి మిగిలింది ఐదుగురు. వీరిలో నబీల్, నిఖిల్ మంచి ఓటింగ్ తో కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సేఫ్. 

ఇక మిగిలింది మణికంఠ, విష్ణుప్రియ, నైనికా.. వీరిలో మణికంఠ ఏదో విధంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు ఎమోషనల్ అవుతూ కొన్నిసార్లు గొడవ పడుతూ తన ఉనికి చాటుకుంటూ యాక్టివ్ గా ఉంటున్నాడు. విష్ణుప్రియకి బయట కొంత ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు ఆమె కూడా హౌస్ లో యాక్టివ్ గా ఉంటోంది. 

ఇక మిగిలింది నైనికా.. ఆమె ఓటింగ్ లో బాగా వెనుకబడిపోయింది. దీనితో ఊహించినట్లుగానే నైనికా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. నైనికా బిగినింగ్ లో రెండు మూడు వారాలు గేమ్ సూపర్బ్ గా ఆడింది. కానీ ఆ తర్వాత ఆమె పెర్ఫార్మన్స్ తగ్గిపోయింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అయి ఉంటే నైనికా సేఫ్ అయ్యేది. కానీ డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఆదిత్యతో పాటు ఆమె కూడా బయటకి వెళ్లక తప్పలేదు. ఇక హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తుండడంతో ఇలా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. నైనికా ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. నైనికా ఎలిమినేషన్ ని ఆదివారం రోజు అఫీషియల్ గా నాగార్జున ప్రకటిస్తారు. 
 

Latest Videos

click me!