నేషనల్ క్రష్ రష్మికకు బిగ్ షాక్... స్టార్ హీరో చేసిన పనికి మధ్యలో ఆగిపోయిన బాలీవుడ్ మూవీ

Published : Aug 30, 2022, 02:26 PM ISTUpdated : Aug 30, 2022, 02:27 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందానకు బాలీవుడ్ లో భారీ షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే కొత్త సినిమా ఆగిపోయిందట.   

PREV
15
నేషనల్ క్రష్ రష్మికకు బిగ్ షాక్...  స్టార్ హీరో చేసిన పనికి మధ్యలో ఆగిపోయిన బాలీవుడ్ మూవీ

రష్మిక మందాన మెయిన్ ఫోకస్ బాలీవుడ్ పైనే. సొంత ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటుంది. రష్మిక హీరోయిన్ గా మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ భారీ బడ్జెట్ మూవీ. 
 

25

వీటితో పాటు రష్మిక మరో స్టార్ టైగర్ ష్రాఫ్ కి జంటగా స్క్రూ ఢీలా టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తుంది. కారణం టైగర్ ష్రాఫ్ నిర్మాత డీల్ కి ఒప్పుకోకపోవడమే. బాలీవుడ్ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓటీటీ దెబ్బతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు. గత నాలుగు నెలల కాలంలో విడుదలైన ఒక్క చిత్రం కూడా సరైన వసూళ్లు అందుకోలేదు. భూల్ బులియా 2, కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి.

35

ఈ క్రమంలో స్క్రూ ఢీలా నిర్మాతగా ఉన్న కరణ్ జోహార్ హీరో టైగర్ ష్రాఫ్ ని రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కోరాడట. స్క్రూ డీలా చిత్రానికి గాను మొదట రూ. 35 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పుడు రూ. 20 కోట్లు తీసుకొని మిగతాది లాభాల్లో వాటాగా తీసుకోవాలి అన్నారట. ఈ డీల్ కి టైగర్ ష్రాఫ్ ససేమీరా అన్నాడట.

45

దీంతో నిర్మాత కరణ్ జోహార్ మూవీ ఆపేసినట్లు సమాచారం. ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న మూవీ అర్థాంతరంగా ఆగిపోయిందట. హీరోయిన్ రష్మిక పారితోషికంతో పాటు టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కోల్పోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నటించిన ఒక్క బాలీవుడ్ సినిమా కూడా విడుదల కాలేదు. కొత్త ప్రాజెక్ట్ మాత్రం మధ్యలో ఆగిపోయింది. దీంతో శకునం ఏం బాగాలేదు అంటున్నారు.
 

55

అయితే రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం పుష్ప 2లో ఆమె హీరోయిన్. అలాగే తలపతి విజయ్ బైలింగ్వల్ మూవీ వారసుడు లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. వారసుడు చిత్రీకరణ జరుపుకుంటుండగా, పుష్ప 2 షూట్ త్వరలో ప్రారంభం కానుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories