‘ఎన్బీకే 107’ ట్రయో సెల్ఫీ.. లొకేషన్ నుంచి బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ అదిరిపోయే లుక్.. పిక్స్ వైరల్..

Published : Aug 30, 2022, 01:53 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ - శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎన్బీకే10క్ష’(NBK107). ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విదేశాల్లో కొనసాగుండగా.. తాజాగా సెట్స్ నుంచి ట్రయో సెల్ఫీతో టీం ఆకట్టుకుంటోంది. మరిన్నీ ఫొటోలూ వైరల్ అవుతున్నాయి.  

PREV
16
‘ఎన్బీకే 107’ ట్రయో సెల్ఫీ.. లొకేషన్ నుంచి బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ అదిరిపోయే లుక్.. పిక్స్ వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  ఒకటి. చిత్రాన్ని ప్రస్తుతం ‘ఎన్బీకే107’ వర్కట్ టైటిల్ తో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 

26

‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య ‘ఎన్బీకే107’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.  ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 
 

36

తాజాగా దర్శకుడు గోపీచంద్ పోస్ట్ చేసిన సెల్ఫీ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎన్బీకే107’ యూనిట్ ప్రస్తుతం టర్కీలోని  ఆయా లొకేషన్లలో సాంగ్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి డైరెక్టర్ గోపీచంద్ మాలినేని అదిరిపోయే ఫొటోను పంచుకున్నాడు. 
 

46

ఈ ట్రయో సెల్ఫీలో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan), దర్శకుడు గోపీచంద్ మలినేని ఉన్నారు. బాలయ్య అందిరిపోయే లుక్ లో సెల్ఫీకి స్టైలిష్ గా ఫోజివ్వగా.. శృతి హాసన్ కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లో తన బ్యూటీతో, స్మైల్ తో ఆకట్టుకుంటోంది. 

56

ప్రస్తుతం చిత్ర షూటింగ్ ‘టర్కీ’లోని మంచు ప్రాంతాల్లో సాంగ్స్, యాక్షన్ మరియు బాలకృష్ణ, శృతి హాసన్ కు మధ్య సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న టీమ్ చిత్రాన్ని శరవేగంగా షూట్ చేస్తోంది. ప్రస్తుతం అక్కడి లోకేషన్స్ నుంచి రిలీల్ అయిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

66

మరోవైపు దసరా కానుకగా ఈ చిత్రం నుంచి బాలయ్య అభిమానుల కోసం సాలిడ్ టీజర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన గ్లింప్స్ కు మించి టీజర్ ఉండబోతోందని అంటున్నారు. అప్పటి వరకు సినిమా కూడా దాదాపు పూర్తి కాబోతోంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!

Recommended Stories