ఆ తర్వాత ఆమె కెరీర్ గాడి తప్పింది. `సాంబా`, `నా ఆటోగ్రాఫ్`, `జై చిరంజీవ`, `మాయాబజార్`, `సత్యభామ`, `అనసూయ`, `స్వాగతం`, `అమరావతి`, `యాగం`, `కలెక్టర్‌గారి భార్య` చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమెకి చాలా సినిమాలు పరాజయం చెందాయి. కానీ `మాయాబజార్`, `అనసూయ`, `అమరావతి` చిత్రాలు మంచి పేరుతీసుకొచ్చాయి. వరుసగా చిన్న సినిమాలకు కమిట్ కావడంతో భారీ చిత్రాలు మిస్ అయ్యాయి.