నాగార్జున, టబు ఒకప్పుడు ప్రేమించుకున్నారనే వార్తలు చాలాకాలంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు రొమాన్స్ చేయబోతున్నారట. దీనిపై నాగార్జున స్పందించారు.
హీరో నాగార్జున, హీరోయిన్ టబు విషయంలో చాలా కాలంగా రూమర్లు ఉన్నాయి. ఇద్దరు ప్రేమించుకున్నారని, పెళ్లి వరకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నాగార్జున స్పందించారు. అలాంటిది ఏం లేదన్నారు. టబు తనకు మంచి స్నేహితురాలు అని, కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. అర్థరాత్రి బెడ్ రూమ్‌లో ఉన్నా కూడా ఫోన్ చేసే ఏకైక వ్యక్తి టబు అని తెలిపారు. ఈ విషయం అమలకి కూడా తెలుసు అని వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల మరికొన్ని రూమర్స్ వినిపించాయి. మరోసారి ఈ ఇద్దరు రొమాన్స్ చేయబోతున్నారని అన్నారు. అయితే ఈ సారి సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారట. ఆ విషయాలు చూస్తే
25
`కింగ్ 100` సినిమాలో నటిస్తున్న నాగార్జున
నాగార్జున గేమ్ ఛేంజర్‌గా మారుతున్నారు. ఆయన ఇటీవల కాలంలో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది రెండు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి విలన్ రోల్ కావడం విశేషం. ఇప్పుడు హీరోగా సినిమా చేస్తున్నారు. ఇది తన వందవ చిత్రం కావడం విశేషం. `కింగ్ 100` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తీక్ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
35
`కింగ్ 100`లో టబు
ఇందులో టబు కనిపించబోతుందట. టబు, అనుష్క నటిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి నాగ్, టబు రొమాన్స్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. టబు తన వందవ చిత్రంలో భాగం కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో నటించాలని ఆమె కోరుకుంటుందని వెల్లడించారు. అంతేకాదు ఇందులో టబు నటిస్తున్నట్టు కన్ఫమ్ చేశారు. ఓ కీలక పాత్రలో టబు కనిపించబోతుందట. అయితే నాగార్జునతో ఆమెకి మధ్య రొమాంటిక్ లింక్ ఉండదని, కేవలం కీలక పాత్రలోనే కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట, వారితో నాగార్జున రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం. మొత్తంగా ఈసారి టబు విషయంలో నాగ్ సేఫ్ గేమ్ ఆడబోతున్నాడని చెప్పొచ్చు.
నాగార్జున మాట్లాడుతూ, సినిమాని ఫాస్ట్ గా పూర్తి చేయాలని అనుకోవడం లేదు. పోటీగా విడుదల చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్ చాలా మారిపోయింది. ఈ సినిమాని చాలా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్‌గా ఉండవు, చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. లార్జర్ దెన్ లైఫ్ హీరో అనే రోజులు పోయాయి` అని చెప్పారు నాగార్జున. మొత్తంగా `కింగ్ 100` ని చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు నాగ్. అందులో తన స్పెషల్ అయిన టబు కూడా ఉండటం విశేషం.
55
నాగార్జున, టబు కలిసి నటించిన చిత్రాలు
ఇక నాగార్జున, టబు కలిసి `నిన్నే పెళ్లాడతా`, `ఆవిడ మా ఆవిడే` చిత్రాల్లో నటించారు. `సిసింద్రి`లో టబు గెస్ట్ రోల్ చేసింది. దీంతో అప్పట్నుంచి టబు, నాగ్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. టబు తెలుగులో చివరగా `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించింది. మళ్లీ ఇప్పుడు నాగ్ సినిమాలో మెరవబోతుంది. కాకపోతే ఆమె హిందీలో మాత్రం ఫుల్ బిజీగానే ఉంది.