Bhumika :భూమికని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా.. కుర్రాళ్ళు 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' పాటేసుకోరూ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 04, 2022, 05:01 PM ISTUpdated : Feb 04, 2022, 07:12 PM IST

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. 

PREV
18
Bhumika :భూమికని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా.. కుర్రాళ్ళు 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' పాటేసుకోరూ..

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

 

28

ప్రస్తుతం Bhumika Chawla వయసు 43 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. గత ఏడాది భూమిక Seetimaarr చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది. 

 

38

గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది. 

 

48

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

 

58

అయితే భూమిక మ్యారేజ్ డే సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. 

 

68

తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. 

 

78

14 ఏళ్లుగా మనం కలసి జీవిస్తున్నాం. మన లైఫ్ లో సంతోషాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కొన్ని విషయాలు నేర్చుకుంటూ కలిసే ముందుకు సాగుతున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. ఎవరి వృత్తిలో వారు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం.. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని భూమిక పోస్ట్ పెట్టింది. 

 

88

తాజాగా భూమిక తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో భూమిక చూపుతిప్పుకోలేని విధంగా అందంతో మెస్మరైజ్ చేస్తోంది. భూమికని కుర్రాళ్లు ఇలా చూస్తే ఖుషి చిత్రంలోని 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' పాటేసుకోవడం ఖాయం. 

 

click me!

Recommended Stories