BholaShankar Review: `భోళాశంకర్‌` మూవీ ట్విట్టర్ రివ్యూ.. మెగాస్టార్‌ రీమేక్‌తో సక్సెస్‌ కొట్టాడా?

First Published | Aug 11, 2023, 3:26 AM IST

చిరంజీవి, తమన్నా, కీర్తిసురేష్‌ కలిసి నటించిన `భోళాశంకర్‌` నేడు విడుదలైంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ముందుగా యూఎస్‌ వంటి ఓవర్సీస్‌లో విడుదలైంది. అక్కడి రెస్పాన్స్ ఎలా ఉందనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 
 

మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`తో సక్సెస్‌ కొట్టారు. `ఆచార్య` వంటి డిజాస్టర్‌, `గాడ్‌ ఫాదర్‌` వంటి యావరేజ్‌ మూవీస్‌ అనంతరం ఆయనకు పెద్ద హిట్‌ దక్కింది. ఇప్పుడు ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేసేందుకు `భోళాశంకర్‌` చిత్రంతో వస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించారు. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ చెల్లి పాత్ర చేసింది. సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలవుతుంది. ముందుగా యూఎస్‌ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాకి ఎలాంటి రియాక్షన్ వస్తుంది?. అక్కడి ఆడియెన్స్ ఏమంటున్నారు అనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం.
 

`భోళాశంకర్‌` తమిళంలో హిట్‌ అయిన `వేదాళం` చిత్రానికి రీమేక్‌. దీంతో సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్‌ రాలేదు. చాలా మంది చూశారనే టాక్‌ ఉంది. అయితే ఓటీటీ లేదని ఇటీవల చిరంజీవి చెప్పారు. అంతేకాదు రీమేక్‌లు చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. మంచి సినిమాని, ఒక చోట హిట్‌ అయిన కథని, మన వాళ్లకి చెప్పాలనుకోవడంలో తప్పేంటి? అన్నారు. చిరంజీవి తన కెరీర్‌లో చాలా రీమేక్‌లు చేసి విజయాలు అందుకున్నారు. ఆయనకు స్టార్‌ డమ్‌ రావడంలో రీమేక్‌ ల పాత్ర మెయిన్‌గా ఉంది.

Latest Videos


ఒకప్పుడు రీమేక్‌లు చేయడంలో తప్పులేదు, కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక, పైగా డబ్బింగుల్లో మన భాషలో విడుదలయ్యాక కూడా రీమేక్‌లు చేస్తే అంతగా ఆసక్తి ఉండదనేది ఆడియెన్స్, క్రిటిక్స్ మాట. కానీ `భోళాశంకర్‌`లో చాలా వరకు మార్పులు చేశారట. 70శాతం మార్చేశామని, ఓ కొత్త కథ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందని దర్శకుడు మెహర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. 

కోల్ కత్తాలో నివసించే తెలుగు ఫ్యామిలీ కథ ఇది. చిరంజీవి, కీర్తి సురేష్‌ అన్నా చెల్లెళ్లు. అక్కడ అమ్మాయిల కిడ్నాప్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందని, మరి అన్నా చెల్లెళ్ల కథకి, కిడ్నాప్‌కి లింక్‌ ఎలా కుదిరిందనేది `భోళాశంకర్‌` కథ. ఓవర్సీస్‌ ఆడియెన్స్ ఇప్పటికే సినిమా చూశారు. సినిమా ఎలా ఉందనేది ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. వారి రియాక్షన్‌ చూస్తుంటే.. సినిమాకి యావరేజ్‌ అనే టాక్‌ ఉంది. ఫస్టాఫ్‌ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చిరంజీవి కామెడీ, కీర్తిసురేష్‌తో వచ్చే ఎమోషన్స్ సీన్లు బాగున్నాయని చెబుతున్నారు. 

అలాగే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుందట. మరోవైపు సెకండాఫ్‌లో వచ్చే చిరంజీవి లోకల్‌ ఎంట్రీ కూడా అదిరిపోయిందని టాక్‌. సెకండాఫ్‌లో చిరంజీవి ర్యాంపేజ్‌ ఆడుకున్నారని ట్వీట్లు చేస్తున్నారు. దీనికితోడు తమన్నా గ్లామర్‌ ఆడియెన్స్ ట్రీట్‌లా ఉంటుందని చెబుతున్నారు. బిజీఎం అదిరిపోయిందట. కాకపోతే లోబోతో వచ్చే కామెడీ సీన్లు అంతగా వర్కౌట్‌ కాలేదు గానీ, సిస్టర్‌ సెంటిమెంట్‌ బాగుందని, అలాగే తమన్నా, చిరు మధ్య కామెడీ నవ్వులు పూయించేలా ఉందంటున్నారు. 
 

ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసేలా ఉంటుందన్నారు. చిరంజీవి ఫ్యాన్‌ అయితే సెకండాఫ్‌ అస్సలు మిస్‌ కాకూడదని చెబుతున్నారు. కోల్‌కత్తా సెంటిమెంట్‌ మెగా ఫ్యామిలీకి మరోసారి వర్కౌట్‌ అయ్యిందని అంటున్నారు. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌ బెటర్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. యావరేజ్‌ మూవీగా చెబుతున్నారు.
 

మరోవైపు `భోళాశంకర్‌` సినిమాకి చాలా వరకు నెగటివ్‌ రెస్పాన్స్ కనిపిస్తుంది. చాలా ఔట్‌ డేటెడ్‌ కథ అని, చిరంజీవి ఎలివేషన్లు తప్ప సినిమాల్లో మ్యాటర్‌ లేదంటున్నారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌ చిరంజీవిని డీల్‌ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అంటున్నారు. చూస్తుంటే ఇది మరో `ఆచార్య` అవుతుందంటున్నారు. సినిమాలో ఏదైనా ప్లస్‌ ఉందంటే అది చిరంజీవి లుక్‌ మాత్రమే అని, ఆయన చాలా యంగ్ లుక్‌లో, అందంగా కనిపిస్తున్నారని, ఎనర్జీ అదిరిపోయిందని చెబుతున్నారు.
 

సినిమాలో హీరోయిన్‌ తమన్నా, కామెడీ సీన్లు, మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌, ఖుషి సీన్లు ఏదీ పండలేదట. కామెడీ చాలా బలవంతంగా పెట్టినట్టు ఉందని, సహజంగా లేవంటున్నారు. హై మూవ్‌మెంట్స్ లేవని, సాంగ్స్ సరైన ప్లేస్‌లో పెట్టలేదని, ఎడిటింగ్‌ లోపాలు చాలా ఉన్నాయని, మ్యూజిక్‌ అంత బాగాలేదని ట్వీట్లు చేస్తున్నారు. మొదటి భాగం ఏమాత్రం ఆసక్తికరంగా, రక్తికట్టించేలా లేదని చెబుతున్నారు. పవన్‌ మేనరిజం అంతగా పండలేదట. దాన్ని కామెడీ చేశారని చెబుతున్నారు.

మొదటి భాగం మొత్తం కామెడీ సీన్లతో నింపేశారట. కానీ అవి కామెడీని పండించడంలో విఫలమయ్యాయని, కథ చాలా ఫ్లాట్‌గా ఉందని, పెద్దగా హై మూవ్‌మెంట్లు లేవంటున్నారు. సెకండాఫ్‌ కొంత వరకు ఓకే కానీ, ఓల్డ్ స్టోరీ కావడంతో ఆయా సీన్లు కూడా అంతగా పేలలేదంటున్నారు. కొన్ని కామెడీ సీన్లు, మరికొన్ని యాక్షన్‌ బ్లాక్‌లు కలిగిన కమర్షియల్‌ మూవీ అని, అంతకు మించి ఇందులో పెద్దగా చెప్పుకోదగినది ఏం లేదంటున్నారు. ఓవరాల్‌గా బిలో యావరేజ్‌ రిజల్ట్ వినిపిస్తుంది. ఇది ఓవర్సీస్‌ ఆడియెన్స్ నిర్ణయం. మన తెలుగు ఆడియెన్స్ కి ఎలా అనిపిస్తుందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

click me!