వెండితెరపై సుభాష్ చంద్రబోస్.. ఆయన జీవితం ఆధారంగా వచ్చిన సినిమాలివే..

First Published | Aug 10, 2023, 8:11 PM IST

ప్రముఖ స్వాతంత్య్ర  సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ (Subhash Chandra bose) జీవితం ఆధారంగా తెలుగు, హిందీలో పలు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఆయన గురించి పలు అంశాలను టచ్ చేస్తూ తీసిన సినిమాలు ఇప్పటికీ ఆయన గొప్ప తనాన్ని గుర్తుచేస్తుంటాయి. ఇంతకీ ఆ సినిమాలేంటనేవి చూద్దాం.. 
 

భారతదేశ ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం Subhas Chandra Bose.  2005లో విడుదలైన ఈ చారిత్రాత్మక యాక్షన్ డ్రామాకు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ అందించారు. తన 101వ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదద్దుకుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ నిర్మించారు. ఇందులో వెంకటేష్, శ్రియా శరణ్, జెనీలియా డిసౌజా మరియు ప్రకాష్ రాజ్ నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. చిత్రంలో స్వాతంత్య్రానికి ముందుకు బ్రిటిష్ వెళ్లిపోయే దశను కథగా చూపించారు. 
 

ప్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero  హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ ఫిల్మ్ గా తెరకెక్కించింది. శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. సచ్చిన్ ఖేడేకర్, కుల్బుషన్ కర్బందా, రజిత్ కపూర్, అర్తిఫ్ జాకారియా, దివ్య దత్త కీలక నటించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. చిత్రం బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష  ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 


ఆ తర్వాత రెండేళ్లకు నేతాజీపై వచ్చిన సిరీస్  Bose : Dead/Alive. హిస్టారికల్ పీరియడ్ డ్రామాగా వచ్చింది. రేష్ నాథ్ రచించారు. పుల్కిత్ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ రావు, నవీన్ కస్తూరియ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారకు. నీల్ అధికారి సంగీతం అందించారు. 9 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ విడుదలైంది. 18 ఆగస్టు 1945న ఓవర్‌లోడ్ జపనీస్ విమానం కూలిపోవడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావించారు. ఆయన మరణంపై ఇప్పటికీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పష్టత లేదు. ఈ సిరీస్ తో కాస్తా వివరించే ప్రయత్నం చేశారు. 2018లో వచ్చిన ఈ సిరీస్ ఆల్ట్ బాలాజీలో విడుదలైంది. 

సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపైనే వచ్చిన చిత్రం ‘గుమ్నామి’ (Gumnaami). ఈ చిత్రాన్ని శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా 2019లో విడుదలైన భారతీయ బెంగాలీ భాషా మిస్టరీ చిత్రమిది. నేతాజీ మరణ రహస్యాన్ని ముఖర్జీ కాన్జూండ్ కమీషన్ విచారణలు, రైటర్ అన్జు రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. శ్రీ వెంకటేష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ మోహతా, ప్రణయ్ రంజన్, మహేంద్ర సోని నిర్మించారు. నటుడు ప్రోసెన్‌జిత్ ఛటర్జీ సుభాస్ చంద్రబోస్, గుమ్నామి బాబా పాత్రలను పోషించారు. అనిర్బన్ భట్టాచార్య, తనుశ్రీ చక్రవర్తి కూడా ప్రధాన పాత్రలు పోషించారు. కొన్నేళ్ల కిందనే వచ్చిన ఈ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. 
 

Subhas Chandra అనేటైటిల్ తోనూ వచ్చిన చిత్రం నేతాజీ  సుభాష్ చంద్రబోష్ జీవితం ఆధారంగా తెరకెక్కిందే. 1966లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యార్థి దశ నుంచి ప్రీడమ్ ఫైటర్ గా ఎలా మారరనేది ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. 

2023లోనూ సుభాష్ చంద్రబోస్ జీవితంలోని కొన్ని అంశాలను టచ్ చేస్తూ వచ్చిన చిత్రం SPy.  ఈ యాక్షన్ చిత్రానికి గ్యారీ BH దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. K. రాజశేఖర్ రెడ్డి రాసిన కథ నుండి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్య మీనన్, అభినవ్ గోమతం, ఆర్యన్ రాజేష్, రవివర్మ, సచిన్ ఖేడేకర్ నటించారు. స్పై ప్రపంచవ్యాప్తంగా 29 జూన్ 2023న విడుదలైంది. 

Latest Videos

click me!