Bholaa Shankar Review:'భోళా శంకర్' ప్రీమియర్ టాక్..పెద్ద మైనస్ అదే, చిరు మూవీతో మెహర్ రమేష్ బౌన్స్ బ్యాక్ ?

Published : Aug 11, 2023, 03:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు భోళా శంకర్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

PREV
17
Bholaa Shankar Review:'భోళా శంకర్' ప్రీమియర్ టాక్..పెద్ద మైనస్ అదే, చిరు మూవీతో మెహర్ రమేష్ బౌన్స్ బ్యాక్ ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు భోళా శంకర్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరుకి మరో హిట్ పడిందా ? తమన్నా చిరు జోడి ఎలా ఉంది ? కీర్తి సురేష్ తో సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా ? వీటన్నింటికంటే డైరెక్టర్ మెహర్ రమేష్ బౌన్స్ బ్యాక్ అయ్యారా ? ఇలా భోళా శంకర్ చిత్రంతో అనేక ప్రశ్నలు ముడిపడి ఉన్నాయి. 

27

ఈ ప్రశ్నలన్నింటికీ నేడు రిలీజ్ కాబోయే భోళా శంకర్ తో సమాధానం దొరకనుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఇది వేదాళంకి రీమేక్ కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. మరి భోళా శంకర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 

37

కోల్ కతా లో అమ్మాయి మిస్సింగ్ సన్నివేశంతో భోళా శంకర్ చిత్రం ప్రారంభమవుతుంది. చిరంజీవి, కీర్తి సురేష్ డాన్స్ చేస్తూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా మారడం, తమన్నా పరిచయ సన్నివేశాలు చకచకా జరిగిపోతాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్లు, సాంగ్స్ అలా సాగుతూ ఉంటాయి. మధ్యలో అమ్మాయిల కిడ్నాప్ గ్యాంగ్ కి సంబంధించిన సీన్స్లు ఆసక్తిని పెంచుతాయి. అయితే ఫన్నీ సన్నివేశాలు పూర్తిగా వర్కౌట్ కాలేదు. 

47

చిరంజీవి మాస్ యాటిట్యూడ్ తో ప్రయత్నించారు కానీ.. మెహర్ రమేష్ ఫస్ట్ హాఫ్ లో ఎగ్జైటింగ్ గా అనిపించే సన్నివేశాలు క్రియేట్ చేయలేదు. ఒకటి రెండు సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక పాటలు, బిజియం కూడా ఒకే అనిపించేలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు అయితే ఓవర్ ది టాప్ గా అనిపిస్తాయి. మిల్కీ బ్యూటీ సాంగ్ చిత్రీకరణ బావుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్ ఫేస్ ఆఫ్ సన్నివేశాలు ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా మెహర్ రమేష్ తీర్చి దిద్దారు. 

57

ఇక సెకండ్ హాఫ్ బిగినింగ్ లో వచ్చే సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి. బోళా రేజ్ బిజియం, భోళా మానియా సాంగ్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో చిరు తన నటన, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన కొన్ని సీన్లు ఆకట్టుకోలేదని అంటున్నారు. కానీ చిరు తన కామెడీ టైమింగ్ తో బోరింగ్ సన్నివేశాలని కూడా సేవ్ చేసే ప్రయత్నం చేశారు. 

67

ఎమోషనల్ సీన్స్ లో ఐతే చిరు నటన అద్భుతంగా ఉంది. కానీ సన్నివేశాలని ఎంగేజింగ్ గా బలంగా మార్చడంలో డైరెక్టర్ మెహర్ రమేష్ మరోసారి ఫెయిల్ అయినట్లు ప్రేక్షకులు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాని మరో స్థాయిలో నిలబెట్టేందుకు అది సరిపోలేదు అని అంటున్నారు. 

77

ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ కాని కామెడీ, చిరంజీవికి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం లాంటి మైనస్ లు వినిపిస్తున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సన్నివేశాలు పడడం ప్లస్. ఎబ్బెట్టుగా అనిపించే ఫన్నీ సీన్స్, మ్యూజిక్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది అనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్ గా భోళా శంకర్ చిత్రం అబౌవ్ యావరేజ్ గా నిలిచే మూవీ అని అంటున్నారు. ఇక చిరు క్రేజీ ఈ చిత్రాన్నిబాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వరకు తీసుకెళుతుందో చూడాలి. 

click me!

Recommended Stories