Bhogi Movie 2 Days Collections: పడిపోయిన భోగి కలెక్షన్లు, రెండు రోజుల్లో వచ్చింది ఇంతే, ఇంకా ఎంత రావాలంటే?

Published : Nov 29, 2026, 08:13 AM IST

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి నటించిన `భోగి` మూవీ నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు ఫర్వాలేదనిపించినా, రెండో రోజు భారీగా పడిపోయింది.

PREV
13
శర్వానంద్‌ భోగి బాక్సాఫీసు వద్ద డ్రాప్‌

వరుస పరాజయాల అనంతరం శర్వానంద్‌ కెరీర్‌ సక్సెస్‌ గాడిన పడింది. ఆయన `నారి నారి నడుమ మురారి`, `బైకర్‌` చిత్రాలతో డీసెంట్‌ హిట్స్ ని అందుకున్నాడు. అదే కోవలో మరో ప్రయోగం చేశారు. తన జోనర్స్ మార్చి పూర్తి యాక్షన్‌ చిత్రం చేశాడు. అదే `భోగి`. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించారు. ఆడుకాలం నరేన్‌, శరత్‌ లోహితస్వ వంటివారు ఇతర పాత్రలు పోషించారు. శ్రీ సత్య ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందనే టాక్‌ వచ్చింది. మరి వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

23
భోగి మూవీ కలెక్షన్లు

`భోగి` మూవీ బాక్సాఫీసు వద్ద నీరసంగా స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రం రూ.2.18కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ.1.53కోట్ల ఇండియా గ్రాస్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.35లక్షలు వచ్చాయి. రెండో రోజు రూ.1.90కోట్లు రాగా, రెండు రోజుల్లో ఈ మూవీ రూ.4.06కోట్లు వచ్చాయి. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు తగ్గిపోయాయి. ఇక ఆదివారం వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. మరి పెరుగుతుందా, తగ్గుతుందా అనేది చూడాలి.

33
భోగి మూవీ బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`భోగి` మూవీ హిట్‌ కావాలంటే ఎంత కావాలి? సినిమా బడ్జెట్‌ ఎంత ? అనేది చూస్తే, ఈ చిత్రానికి సుమారు రూ.50కోట్ల బడ్జెట్‌ పెట్టినట్టు సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలో రూ.17కోట్లు వచ్చాయి. ఓటీటీనే పదికోట్లకు అమ్ముడు పోయిందట. ఇక థియేట్రికల్‌ విషయానికి వస్తే రూ.23కోట్ల వ్యాల్యూ లెక్క కట్టారట. అంటే నలభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రావాలి. కొన్ని లెక్కల ప్రకారం రూ.16కోట్లు అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా హిట్‌ కావాలంటే రూ.35-40కోట్ల బాక్సాఫీసు వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు అందులో కేవలం పది శాతం మాత్రమే రాబట్టింది. సినిమాకి ఉన్న టాక్‌, వస్తోన్న కలెక్షన్లు చూస్తుంటే ఇది భారీగా నష్టాలను మిగిల్చేలా ఉంది. మరి ఏదైనా మ్యాజిక్‌ జరుగుతుందేమో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories