Weekend Movie Collection: 5 సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ.. వీకెండ్‌కు ఏ మూవీ బెస్ట్?

Published : Nov 28, 2026, 08:25 PM IST

Weekend Movie Collection: ఈ వీకెండ్‌లో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రామాయణ, ఓం సహా 5 సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
16
బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత?

ఈ వీకెండ్‌లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే.. థియేటర్లలో 5 సినిమాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. నవంబర్ 27న కూడా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి మీకు మంచి వినోదాన్ని అందిస్తాయి. ఏయే సినిమా ఎంతెంత కలెక్ట్ చేసిందో పూర్తి వివరాలు ఏంటంటే?

26
భారత్‌లో 1,000 కోట్లు రామాయణ

నితీష్ తివారీ 'రామాయణ: పార్ట్ 1' ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. శుక్రవారం ఒక్క ఇండియాలోనే 8.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా వరుసగా 23 రోజుల నుంచి ప్రదర్శితమవుతోంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 1,195 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1,790 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సాయి పల్లవి, సన్నీ డియోల్ కూడా ఉన్నారు.

36
భోగి (Bhogi)

మొదటి రోజే భోగి 1.90 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ నటించిన తెలుగు సినిమా భోగి. సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం భారత్‌లో వసూలైన మొత్తం 2.18 కోట్ల రూపాయలు.

46
ఓం: రెండు వారాలు

ధనుష్, మమ్ముట్టి నటించిన 'ఓం: ఆపరేషన్ మోల్' చిత్రం ఎనిమిదో రోజు 2.20 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటివరకు 71.50 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. గురువారం 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా.. శుక్రవారం చాలా తక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా 41.3 శాతం డౌన్ అయ్యింది.

56
గన్‌మాస్టర్ జీ9 (Gunmaaster G9)

సాక్‌నిల్క్ (Sacnilk) ప్రకారం.. ఇమ్రాన్ హష్మి నటించిన గన్‌మాస్టర్ జీ9 చిత్రం నిన్న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఒక్క ఇండియాలోనే 3.65 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్, అపరశక్తి ఖురానా, అవనీత్ కౌర్ నటించారు.

66
గాడ్జిల్లా మైనస్ జీరో (Godzilla Minus Zero)

గాడ్జిల్లా మైనస్ జీరో చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ సినిమా 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. జపనీస్ చిత్రం దేశీయ నెట్ కలెక్షన్ మొత్తం రూ. 4.80 కోట్లకు చేరుకుంది. శుక్రవారం కలెక్షన్లు ముందు రోజు రూ. 32 లక్షల కంటే 15.6 శాతం తక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories