Bigg Boss Telugu 10: అమన్, ముఖేష్ కు ఇచ్చిపడేసిన నాగార్జున, వర్షిణి ఏడుపులు.. త్రిగుణ్ కు వార్నింగ్

Published : Nov 28, 2026, 10:47 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈక్రమంలో వీకెండ్ నాగార్జున చేతిలో ఎవరెవరికి తిట్లు పడ్డాయి. ఎవరికి క్లాస్ పీకాడు? హోస్ట్ వేసిన ప్రశ్నలు, కంటెస్టెంట్ల సమాధానాలతో ఈ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది.

PREV
15
కన్ఫెషన్ రూమ్‌లో వర్షిణి ఏడుపు.. నాగార్జున ప్రశ్నలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటుంది. ఈక్రమంలో ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. వారం వారం పోటీ మరింత పెరగడంతో పాటు ఎమోషనల్ గా పరిస్థితులు మునుపెన్నడు లేనంతగా మారుతూ వస్తున్నాయి. ఈక్రమంలో ఈ వారం ఆట గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి నాగార్జున రావడం.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేయడం జరిగిపోయింది.ముఖ్యంగా

హౌస్‌లోని ప్రస్తుత పరిస్థితి గురించి నాగార్జున అడిగిన ప్రశ్నకు వర్షిణి కన్ఫెషన్ రూమ్‌లో ఎమోషనల్ గా స్పందించారు. ఈ వారం ఏం జరిగిందని నాగార్జున అడగ్గా, ఇల్లంతా ఒకవైపు ఉన్నట్లుగా తొమ్మిది మంది ఒకవైపు, ఇద్దరు ఒకవైపు ఉన్నట్లుగా భావిస్తున్నామని, తమపై గ్యాంగ్‌గా ఏర్పడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. సపోర్ట్ రావడం లేదని, ఏ విషయంలో అలా జరిగిందని నాగార్జున ప్రశ్నించగా, క్యారెక్టర్ విషయంలోనే ఆ పాయింట్ వచ్చిందని వర్షిణి చెప్పారు.

25
త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నాగార్జున

త్రిగుణ్ ఏమన్నాడని నాగార్జున అడగ్గా, "చీప్ క్యారెక్టర్ నీది" అంటూ ముఖం మీదే అన్నాడని, ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ అన్నాడని వర్షిణి కన్నీటితో వివరించారు. ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని తర్వాత వివరణ ఇవ్వలేదా అని నాగార్జున ప్రశ్నించగా, ఫ్రెండ్‌షిప్ విషయంలో అన్నానని చెప్పలేదని వర్షిణి సమాధానం ఇచ్చారు. వీడియో ఫుటేజ్ ప్లే చేసిన తర్వాత, త్రిగుణ్ ఏ ఉద్దేశంతో అన్నాడో క్లారిటీ వచ్చిందని నాగార్జున అన్నారు. నువ్వు అడిగిన వెంటనే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు కదా వర్షిణి, నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో చూపించారు అని నాగార్జున అనడంతో వర్షిణి షాక్ అయ్యింది.

త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున, ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇవ్వని క్యారెక్టర్ అని తను గురించి నువ్వు అనుకున్నట్లే, తను కూడా ఎగ్జాక్ట్‌గా అదే అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల నీ దగ్గర నుంచి మనస్ఫూర్తిగా అపాలజీ కావాలని నాగార్జున కోరారు.

35
కెప్టెన్ అమన్‌పై నాగార్జున ఫైర్..

అమన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, కెప్టెన్ అయిన తర్వాత కొంచెం కంట్రోల్ తప్పిందా అని నాగార్జున ప్రశ్నించారు. అమన్ "అలా ఏం లేదు" అని సమాధానం ఇచ్చారు. మనిషి క్యారెక్టర్ టాప్ పొజిషన్‌లో, చాలా ప్రెజర్‌లో ఉన్నప్పుడు తెలుస్తుందని, ఆ బిహేవియర్ ఏంటో అదే ఒరిజినల్ క్యారెక్టర్ అని నాగార్జున అన్నారు. వీడియో వేసి మరీ అమన్ చేసిన పనులను ఎత్తి చూపించాడు. వీడియో ఫుటేజ్ చూపించిన తర్వాత... ముఖేష్ ను పట్టుకునిఅలా ఎలా అన్నావు.. "ఏంటి గబ్బు" అని అమన్‌ను నాగార్జున నిలదీశారు.

దానికి అమన్ స్పందిస్తూ: మిల్క్ వేడి చేయడం కొంచెం బయటికి వెళ్లిందని, తాను క్లీన్ చేస్తుండగా ముఖేష్ డైరెక్ట్‌గా వచ్చి "ఇందుకే నిన్ను బ్రెయిన్‌లెస్ అన్నాను" అని స్టార్ట్ చేశాడని చెప్పారు. ఏ పని కూడా చెప్పిన టైమ్‌కు చేయడని, ఈగో ఆల్‌వేస్ ఈగో అంటూ తన వైపు వాదన వినిపించారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ, కెప్టెన్ అనేది పవర్ కాదని, అదో రెస్పాన్సిబిలిటీ అని తేల్చి చెప్పారు. ముకేశ్‌కు స్టార్‌డమ్ ఉందని, అలాంటి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించి హ్యాండిల్ చేయాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగ్గేది నువ్వేనని స్పష్టం చేశారు.

45
ముఖేష్ కు నాగార్జున క్లాస్..

ముకేశ్ విషయంలో నాగార్జున మాట్లాడుతూ, ముకేశ్‌కు స్టార్‌డమ్ ఉందని చెప్పగా, స్టార్, స్టార్‌డమ్ తన మీద ఉందన్నది కాదని ముఖేష్ సమాధానం ఇచ్చారు. తాను చెబుతున్నానని, నువ్వు స్టార్‌వు, నీకు స్టార్‌డమ్ ఉందని నాగార్జున స్పష్టం చేశారు. అనంతరం ముకేశ్ మీద ఎందుకు నీకు అంత ద్వేషం, అంత బాగా ఆడుతుంటే ఆ రౌండ్ క్యాన్సిల్ చేశావని త్రిగుణ్ ను నాగార్జున ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెపుతూ.. తన వెర్షన్ ను వినిపించాడు.

అంతే కాదు ముఖేష్ బట్టలు తీసి స్విమ్మింగ్ ఫూల్ లో పడేసిన ఘటనపై, ఇందులో తప్పు ఎవరిదని నాగార్జున వర్షిణిని అడిగారు. తన బట్టలు కూడా దాంట్లో ఉన్నాయని, 24 అవర్స్ అవ్వకుండానే తను పడేశాడని వర్షిణి చెప్పారు. దీనిపై ముకేశ్‌ను ఉద్దేశించి నాగార్జున, నిన్ను బోలెడంత మంది ఇష్టపడేవాళ్లు ఉన్నారని, కానీ నువ్వు ఆడే తీరు, ప్రవర్తన మూలాన వాళ్లకు ఇష్టం పోతుందని, స్టార్‌డమ్ పోతుందని హెచ్చరించారు.

55
స్నేక్ టాస్క్, బాస్కెట్ ఫౌల్

స్నేక్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారని నాగార్జున అడగ్గా, అమన్ "త్రిగుణ్ సార్" అని చెప్పారు. బాగా ఆడిన త్రిగుణ్ అవుతే ఆర్కే ఎలా గెలిచాడని నాగార్జున ప్రశ్నించగా, కింద పడ్డ బాక్స్ ఏదైతే ఉందో గుంజుకోవచ్చు, లాక్కోవచ్చని అమన్ చెప్పారు. కింద పడిన తర్వాత కదా దాని దగ్గరికి వెళ్లాలని వీడియో చూపించి నాగార్జున తప్పు పట్టారు. తగిలింది సార్ అని అమన్ చెప్పగా, బాక్స్ పడిన తర్వాత తీసుకోవాల్సింది అని నాగార్జున స్పష్టం చేశారు.

బాల్‌ను బాస్కెట్ లోపల ప్రొటెక్ట్ చేసుకునే అంశంపై ఆర్కే స్పందిస్తూ, అతను లాగడం వల్ల నాకు అలా వచ్చేసింది తప్ప, బాస్కెట్ లాగి బాల్ తీయాలని తన ఉద్దేశం లేదని చెప్పారు. వర్షిణి నువ్వు సంచాలక్ అయితే ఏం డెసిషన్ తీసుకుంటావని నాగార్జున అడగ్గా, "బాస్కెట్ తీసింది మాత్రం ఫౌల్ ఇస్తాను" అని వర్షిణి సమాధానం ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories