రెండో రోజు కూడా భీమ్లా నాయక్ చిత్రం స్టన్నింగ్ నంబర్ నమోదు చేసే మరోసారి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నైజాంలో రెండవరోజు భీమ్లా నాయక్ చిత్రం 7.5 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో నైజాం ఏరియాలో టోటల్ షేర్ 19.5 కోట్లకు చేరింది. ఇక మిగిలిన ఏరియాలలో రెండవ రోజు షేర్స్ గమనిస్తే.. సీడెడ్ లో 1.6 కోట్లు, ఈస్ట్ లో 74 లక్షలు, వెస్ట్ లో 42 లక్షలు, కృష్ణలో 65 లక్షలు, గుంటూరులో 65 లక్షలు, నెల్లూరులో 36 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.29 కోట్ల షేర్ నమోదైంది.