చివరిగా తెలుగులో ‘నిశ్బద్ధం’, ‘వకీల్ సాబ్’ మూవీలో నటించిన అంజలి మళ్లీ తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్ 3’మూవీలో నటించింది. ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కాబోతోంది. మరోవైపు తాజాగా ‘ఆర్సీ 15’, తమిళ మూవీ ‘పూచండి’ మూవీల్లో నటిస్తోంది.