Samyuktha Menon Photos: చార్మినార్‌ వద్ద `భీమ్లా నాయక్‌` బ్యూటీ హల్‌చల్‌.. సక్సెస్‌ ఆనందంలో ఓల్డ్ సీటీలో రచ్చ

Published : Feb 25, 2022, 07:28 PM ISTUpdated : Feb 25, 2022, 07:29 PM IST

`భీమ్లా నాయక్‌` చిత్రంలో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది సంయుక్త మీనన్‌. మలయాళంకి చెందిన ఈ భామ ఇప్పుడు సక్సెస్‌ ఆనందంలో చార్మినార్‌ వద్ద రచ్చ చేస్తుంది. అక్కడి అందాలను తిలకిస్తూ హల్‌చల్‌ చేసింది. 

PREV
17
Samyuktha Menon Photos: చార్మినార్‌ వద్ద `భీమ్లా నాయక్‌` బ్యూటీ హల్‌చల్‌.. సక్సెస్‌ ఆనందంలో ఓల్డ్ సీటీలో రచ్చ

ఓ వైపు థియేటర్‌లో హీరోయిన్‌ సంయుక్త మీనన్‌(Samyuktha Menon) నటించిన  `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) సినిమా మోతమోగుతుంది. మరోవైపు ఈ అందాల భామ శుక్రవారం చార్మినార్‌ వద్ద సందడి చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో చార్మినార్‌ అందాలను తిలకించింది. ఐకానిక్‌ చార్మినార్‌ అందాలను ఆస్వాదిస్తూ మంత్ర ముగ్దులయ్యింది. తాజాగా అక్కడ సంయుక్త మీనన్‌ దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

27

`భీమ్లా నాయక్‌` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది Samyuktha Menon. నిజానికి ఈ అమ్మడు మొదట తెలుగులో కళ్యాణ్‌ రామ్‌ నటించిన `బింబిసార` చిత్రానికి కమిట్‌ అయ్యింది. కానీ ఇప్పుడు `భీమ్లా నాయక్` రిలీజ్‌ కావడంతో సంయుక్త తొలి మూవీ `భీమ్లా నాయక్‌`గా నిలిచింది. అంతేకాదు తొలి చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

37

ఇందులో సంయుక్త మీనన్‌.. రానా నటించిన డానియెల్‌ శేఖర్‌ భార్య పాత్రలో నటించింది. మలయాళంతో పోల్చితే హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత పెంచడంతో సంయుక్త మీనన్‌ పాత్రకి కాస్త గుర్తింపు దక్కింది. అందుకే అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. అయితే `భీమ్లా నాయక్‌` ప్రమోషన్‌లో మరో హీరోయిన్‌ నిత్యా మీనన్‌ దూరంగా ఉండటంతో ఇప్పుడు అందరి చూపులు సంయుక్త మీనన్‌ వైపు పడ్డాయని చెప్పొచ్చు. పైగా కొత్త బ్యూటీ కావడంతో మరింత స్పెషల్‌గా మారింది.  Samyuktha Menon Photos.

47

పైగా సంయుక్త కమర్షియల్‌ హీరోయిన్‌ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. మొన్న `భీమ్లా నాయక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసి మరింత స్పెషల్‌ గా మారింది. మరోవైపు తనదైన స్పీచ్‌తోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు చార్మినార్‌లో సందడి చేసి హైలైట్‌ అవుతుంది. 

57

కేరళాలోని పాలక్కడ్ లో పుట్టిపెరిగిన ఈ అందాల సుందరి 2016లోనే మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఎక్కవగా ఆమె టోవినో థామస్ సినిమాల్లో నటించింది. 'కలరి' అనే సినిమాతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. 'గాలిపట 2' సినిమాతో త్వరలో కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

67

ఈ నేపథ్యంలోనే` భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో రానా జోడీగా ఆమె కనిపించింది. ఈ చిత్రం సక్సెస్‌తో సంయుక్త మీనన్‌కి తెలుగులో ఆఫర్స్ క్యూ కడతాయనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 

77

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలుండటం విశేషం. కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే  ధనుష్‌ సరసన తెలుగు సినిమా `సార్‌`లో కథానాయికగా ఎంపికైంది. దీంతోపాటు `భీమ్లా నాయక్‌` రిలీజ్‌ కావడంతో మరికొన్ని ఆఫర్స్ ఈ బ్యూటీని వెతుకుంటూ వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories