ఈ సాంగ్ లో నటించడం పట్ల కీర్తి సురేష్ ను మహేశ్ బాబు ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు చాలా ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో నటించే కీర్తి సురేష్ ఇలాంటి బీ గ్రేడ్ మ్యూజిక్ వీడియోలో నటించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన ఎంపిక సరైంది కాదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో రామ్, పవన్ కళ్యాణ్, నాని లాంటి సూపర్ స్టార్లతో నటించిన కీర్తికి అసలేమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.