పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన సాంగ్స్, టీజర్స్ తో భీమ్లా నాయక్ మానియా ఒక రేంజ్ లో సాగుతోంది.