Guppedantha Manasu: ఒకరి గురించి ఒకరు ఆలోచనలో పడ్డ రిషి, వసు.. గొడవపడుతున్న జగతి, మహీంద్రా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 19, 2021, 10:51 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: ఒకరి గురించి ఒకరు ఆలోచనలో పడ్డ రిషి, వసు.. గొడవపడుతున్న జగతి, మహీంద్రా?

తన గదిలో రిషి (Rishi) ఒంటరిగా కూర్చొని వసు అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. అంతలోనే మహేంద్ర వర్మ (Mahindra) వచ్చి కాసేపు మాట్లాడుతుంటాడు. తమ మధ్య ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు మహేంద్రవర్మ.
 

29

కానీ రిషి మాత్రం అస్సలు బయటపడకుండా మాట్లాడుతాడు. ఇక జగతి (Jagathi)మేడమ్ కు తన ఫోన్ నుండి ఫోన్ చేసి వసు హెల్త్ గురించి అడగమంటాడు. దీంతో మహేంద్ర వర్మ జగతికి ఫోన్ చేసి వసు (Vasu) హెల్త్ గురించి తెలుసుకుంటాడు.
 

39

ఇక మహేంద్రవర్మ వసు (Vasu) గురించి ఏమైనా నిజం బయట పెడతాడేమో అనుకొని ప్రశ్నించడంతో రిషి వర్షంలో తడిచి అలా జరిగిందని చెబుతాడు. వెంటనే మహేంద్రవర్మ తన మనసులో ఇంకా రిషి (Rishi) బయట పెట్టట్లేదు అని బాధ పడతాడు.
 

49

జగతి (Jagathi) వసు గురించి ఆలోచిస్తూ కాలేజ్ కు వెళ్తుంది. పుష్ప ఎదురుపడి వసు గురించి అడగటంతో తన ఆరోగ్యం బాలేదని రేపు వస్తుందని తనను బాగా చదువుకోమని చెప్పి పంపిస్తుంది. జగతి తన క్యాబిన్ లో మహేంద్ర వర్మ తో (Mahindra) ఉంటుంది.
 

59

ఇక వీరిద్దరూ వసు, రిషి (Vasu, Rishi) ల గురించి మాట్లాడుకుంటారు. వారి మధ్య ఏం జరిగిందో అని ఆలోచిస్తారు. ఇక జగతికి (Jagathi) మహేంద్రవర్మ పై అనుమానం రావడంతో మహేంద్రవర్మ ను గట్టిగా అడుగుతుంది. కానీ మహేంద్ర వర్మ చెప్పకుండా తప్పించుకుంటాడు.
 

69

తను ఏం చెప్పలేదు అంటూ శిరీష్ (Sireesh) పెళ్లి మాత్రమే చెప్పాను అని అనేసరికి జగతి ఆలోచనలో పడుతుంది. కానీ ఇందులో ఏదో ఉంది అంటూ అది పెద్ద సమస్యే అని మాట్లాడుకుంటూ ఉండగా రిషి (Rishi) వచ్చి జగతి మేడమ్ ను ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు.
 

79

రిషి (Rishi) రాకను చూసి జగతి, మహేంద్ర వర్మ షాక్ అవుతారు. ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగే సరికి పిల్లల ఎగ్జామ్ గురించి అని సమాధానం ఇచ్చి తప్పించుకుంటాడు మహేంద్రవర్మ (Mahindra). రిషి కూడా ఏమీ అనకుండా ఈ రోజు మీటింగ్ లో మాట్లాడుకోవాలని చెబుతాడు.
 

89

వసు (Vasu) ఆరోగ్యం గురించి రిషి జగతి మేడమ్ ను అడగటంతో తన పరిస్థితి బాలేదు అని ఈ రోజు కాలేజ్ కి రాదు అని రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పటంతో వెంటనే రిషి (Rishi) మహేంద్ర వర్మ తో బయటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరుతాడు.
 

99

మరోవైపు వసు (Vasu) ఇంట్లో కూర్చొని రిషి అన్న మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది. అసలు ఎందుకు అలా ప్రవర్తించాడని తన మనసులో ఏముంది అని అనుకుంటుంది. రిషి (Rishi) కూడా కారులో ప్రయాణిస్తూ వసు గురించి ఆలోచిస్తాడు.

click me!

Recommended Stories