సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించారు. అయితే ఆయన పేరుకే దర్శకుడు ఈ చిత్ర కర్త కర్మ క్రియ మొత్తం పవనే. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కథ, స్క్రీన్ ప్లే రాసుకుని చేసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. కాజల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 21.72 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫైనల్ గా నష్టాలు మిగిల్చి ప్లాప్ లిస్ట్ లో చేరింది.