దేశముదురు సినిమాలో నటించే వరకు హన్సిక వయస్సు 15 ఏండ్లే. సినిమా రిలీజ్ అయ్యే వరకు 16 ఏండ్లు నిండాయి. ఈ సినిమా తనకు తొలిచిత్రం. అందులోనూ మంచి విజయం సాధించడంతో హన్సికకు సౌత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ వెంటనే వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ‘కంత్రి, మస్కా, బిల్లా, జయీ భవ, సీతా రాముల కళ్యాణం, కందిరీగ, హో మై ఫ్రెండ్, సింగం 2, పవర్’సినిమాల్లో నటించిన ప్రేక్షకులను అలరించింది.