భరణి ఆరు వారాల పారితోషికం ఎంతో తెలుసా?.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 లోనే హైయ్యెస్ట్, ఆల్మోస్ట్ విన్నర్‌ రేంజ్‌

Published : Oct 20, 2025, 09:11 AM IST

Bharani Remuneration: ఆరో వారంలో బిగ్‌ బాస్‌ తెలుగు 9 నుంచి ఎలిమినేట్‌ అయిన భరణికి ఎంత పారితోషికం దక్కిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సీజన్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ కావడం విశేషం.  

PREV
14
ఆరో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 నుంచి భరణి ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఆరోవారం ఊహించని విధంగా భరణి శంకర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మొదట్నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ వస్తోన్న ఆయన అనూహ్యంగా ఈ వారం ఎలిమినేట్‌ కావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. భరణి ఎలిమినేషన్‌తో దివ్య, తనూజ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది. అయితే భరణి బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లి గేమ్‌ ఆడటం, ఎంటర్‌టైన్‌ చేయడం కంటే రిలేషన్స్ పెంచుకోవడంపైనే ఫోకస్‌ పెట్టాడనే విమర్శ ఉంది. తనూజ, దివ్యలతో ఆయన క్లోజ్‌గా ఉన్న విషయం తెలిసిందే. తనూజ ఏకంగా పదే పదే నాన్న నాన్న అంటూ సొంత తండ్రి కంటే ఎక్కువ ప్రేమగా పిలిచింది. ఆమెను ఆయన కూడా అలానే ట్రీట్‌ చేశాడు. దివ్య విషయంలో అదే జరిగింది. వాళ్ల కోసమే గేమ్‌ ఆడుతున్నట్టుగా ఆయన తీరు ఉంది. దీనిపై చాలా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఓ రకంగా భరణి ఎలిమినేషన్‌కి ఇదే కారణమనే టాక్‌ ఉంది.

24
బిగ్‌ బాస్‌ తెలుగు 9లో అత్యధిక పారితోషికం భరణికే

ఏదేమైనా భరణి ఆరోవారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. రాము రాథోడ్‌, భరణి మధ్య ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ జరగ్గా, ఇమ్మాన్యుయెల్‌ పవర్‌ అస్త్రాని రాము రాథోడ్‌కి ఉపయోగించాడు. దీంతో భరణి ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అయితే ఆరు వారాలపాటు హౌజ్‌లో ఉన్న భరణికి ఎంత పారితోషికం ఇచ్చారు. ఆయన వారానికి ఎంత తీసుకున్నారు? ఇప్పుడు ఓవరాల్‌గా ఎంత వచ్చిందనేది చూస్తే, ఆ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెంస్టెంట్‌గా భరణి నిలవడం విశేషం.

34
ఆరు వారాల భరణి పారితోషికం ఎంతంటే?

భరణికి బిగ్‌ బాస్‌ నిర్వాహకులు రోజుకి యాభై వేల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. ఇంతటి పారితోషికం ఎవరికీ ఇవ్వరు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా బిజీ, చాలా క్రేజీ సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తుంటారు. రోజుకి రూ.40-45 వేలు ఇవ్వడమే పీక్‌. కానీ భరణికి రూ.50వేలు ఇవ్వడం విశేషం. ఈ లెక్కన ఆయన వారానికి రూ.3.50లక్షలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆరు వారాలు హౌజ్‌లో ఉండటంతో భరణికి మొత్తంగా రూ.21లక్షల పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్మ్ విన్నర్‌ రేంజ్‌. ఎందుకంటే బిగ్‌ బాస్‌ ఫైనల్స్ లో టాప్‌ 3 కంటెస్టెంట్లకి సూట్‌కేస్‌ ఆఫర్‌ చేస్తుంటారు. పది లక్షలు, పదిహేను, ఇరవై లక్షలు అంటూ టెంప్ట్ చేస్తుంటారు. అలా ఎవరైనా సూట్‌కేస్‌తో వెళ్లిపోతే ఫ్రైజ్‌ మనీ రూ.50లక్షల్లో అది కోత విధించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విన్నర్‌కి దక్కిదే ముప్పైలక్షల లోపే. టాక్స్ లు పోతే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు భరణికి కూడా ఆ రేంజ్‌లో పారితోషికం రావడం విశేషం.

44
తనూజ, దివ్య రిలేషన్స్ పై భరణి

ఇదిలా ఉంటే భరణి.. ఎలిమినేషన్‌ తర్వాత బిగ్‌ బాస్‌ బుజ్‌లో మాట్లాడారు. శివాజీ హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భరణిని నిలదీశాడు శివాజీ. గేమ్‌ ఆడమంటే, షోకి వెళ్లి సీరియల్స్ స్టోరీ చూపించాడని కామెంట్‌ చేశాడు. తనూజ, దివ్యలతో భరణి బాండింగ్‌పై స్పందిస్తూ, అది తన గేమ్‌పై ప్రభావం చూపించలేదన్నాడు. తన గేమ్‌ విషయంలో క్లారిటీతోనే ఉన్నట్టు తెలిపారు. చెప్పాల్సిన సందర్భంలో తన అభిప్రాయం గట్టిగానే చెప్పినట్టు వెల్లడించారు. మరోవైపు సంజనాపై ఫైర్‌ అవ్వడానికి సంబంధించిన స్పందిస్తూ, తాను షార్ట్ టెంపర్‌ అని, ఝుమ్మున(బీపీ) లేస్తుందని చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి పూర్తి ఎపిసోడ్‌ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories