
బిగ్ బాస్ తెలుగు 9 13వ వారం షో గతంతో పోల్చితే ఆసక్తికరంగా మారింది. అయితే టికెట్ టూ ఫినాలే మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. బిగ్ బాస్ ఇస్తోన్న టాస్క్ ల్లో ఎవరు విన్ అవుతారు, ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వీళ్లకి ఇస్తోన్న టాస్క్ లు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఇప్పుడు అసలైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా, బాండింగ్‌కే పరిమితమైన భరణి ఇప్పుడు రెచ్చిపోతున్నారు. తన ఒరిజినాలిటీని చూపిస్తున్నారు.
భరణి ప్రస్తుతం హౌజ్‌లో ఒక స్పెషల్ కంటెస్టెంట్. ఎందుకంటే ఆయన్ని ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. కానీ ఎలిమినేట్ అయిన కొందరికి మళ్లీ అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా ఓటింగ్ పెట్టారు. భరణిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై చాలా విమర్శలు వచ్చాయి. ట్రోల్స్ కూడా జరిగింది. భరణి వ్యవహారంపై కూడా ట్రోల్స్ చేశారు. సాధారణ ఆడియెన్స్ తోపాటు ఇతర కంటెస్టెంట్ల అభిమానులు కూడా బాగా ఆడుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఒత్తిడి మేరకే భరణిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారని అన్నారు. ఆ మధ్య ఎలిమినేట్ అయిన దివ్వెల మాధురి కూడా ఈ ఆరోపణలు చేసింది. నాగబాబు, పవన్ కళ్యాణ్ ల వల్లే భరణి మళ్లీ వచ్చారని ఓ ఇంటర్వ్యూలో ఆమె కామెంట్ చేసింది.
దానికి బలం చేకూరుస్తూ ఆ మధ్య ఫ్యామిలీ వీక్‌లో భరణి వాళ్ల అమ్మతోపాటు నాగబాబు కూడా వచ్చాడు. భరణికి నాగబాబు గురువు అట. ఆ విషయాన్ని స్టేజ్‌పై తెలిపారు. తనకు తమ్ముడులాంటి వాడు అని, అతనంటే నాకు ఎంతో ఇష్టమని నాగబాబు తెలిపారు. అదే సమయంలో చాలా కోపిష్టి అని, ఎవరైనా ఏదైనా అంటే మొదట కొట్టి మాట్లాడుతుండేవాడని, గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయని తెలిపారు నాగబాబు. కానీ హౌజ్‌లో ఇంత సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నాడో అర్థం కావడం లేదని, నువ్వు నీలా ఉండాలని, ఇలా ఉంటే నడవదని సూచించాడు నాగబాబు. ఈ సందర్భంగా భరణి రియాలిటీని బయటపెట్టారు.
ఇన్నాళ్లు సైలైంట్‌గా ఉన్న భరణి ఇప్పుడు నెమ్మదిగా అగ్రెసివ్‌గా మారుతున్నారు. నాగబాబు వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. తాజాగా శుక్రవారం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో అది స్పష్టమవుతుంది. తాజాగా టికెట్ టూ ఫినాలే టాస్క్ లో భరణి రెచ్చిపోయాడు. తన ఉగ్రరూపం చూపించాడు. టికెట్ టూ ఫినాలే కోసం రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ట్రయాంగిల్, సర్కిల్, స్వ్కేర్ బ్లాక్స్ ని పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో రీతూ పెట్టిన ట్రయాంగిల్ బ్లాక్ కి ఒక చోట కర్వ్ ఉంది. దాన్ని సంచాలక్ సంజనా ట్రయాంగిల్‌గా పరిగణించింది. కానీ అది రెక్ట్ యాంగిల్ అని, నాలుగు భుజాలున్నాయని చెబుతూ రచ్చ చేశాడు భరణి.
రీతూ స్పందిస్తూ తన పేరు తీయోద్దని, దాన్ని ట్రయాంగిల్ కాకపోతే ఏమంటారంటూ ప్రశ్నించింది. దీంతో తాను సంచాలక్ సంజనాతో మాట్లాడుతున్నా అంటూ రెచ్చిపోయాడు భరణి. ఎవరి మాట వినకుండా అరుస్తూనే ఉన్నాడు. `అయినా ఒకరు గెలిచారంటే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి, ఒకరు హ్యాపీగా ఉండకూడద`ని కామెంట్ చేస్తూ లోపలికి వెళ్లింది రీతూ. దీనికి భరణి స్పందించి కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ ఛీటింగ్ జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ షూస్ చూపిస్తే గుర్తు పట్టారు అనేది అన్నీ వీడియోస్ తో సహా బయటకు వచ్చాయి. అయినా ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నానంటూ బరస్ట్ అయ్యాడు భరణి.
దీనికి కళ్యాణ్ స్పందించారు. కన్ఫెషన్ రూమ్‌లో ఏం చూపించారో నాకు తెలుసు, ఆ విషయం వీడికి కూడా తెలియదు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. దీనికి భరణి.. తాను సంచాలక్‌తో మాట్లాడుతున్నా, సంజనాగారితో మాట్లాడుతున్నా అంటూ కళ్యాణ్‌పైపైకి వెళ్లాడు భరణి. కళ్యాణ్ కూడా మీద మీదకు వచ్చారు. నీ పేరు తెచ్చానా అంటూ భరణి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరు కొట్టుకునేంత పరిస్థితి ఏర్పడింది. దెబ్బకి హౌజ్ మొత్తం హీటెక్కిపోయింది. షో దగ్గర పడే కొద్ది భరణి తన ఒరిజినాలిటి బయటపెడుతున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబు స్ట్రాటజీని భరణి అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు ఇటీవల ఆయన క్రేజ్ కూడా పెరుగుతుంది. ఓటింగ్ కూడా పెరిగింది. గతంలో ఎప్పుడూ బాటమ్‌లో కనిపించేవారు. డేంజర్‌లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ ఈ(13వ) వారం సేఫ్ జోన్‌లో ఉన్నారు. మూడో స్థానంలో నిలవడం విశేషం. క్రమంగా ఆయన పుంజుకుంటున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతున్నారు. బాండింగ్స్ నుంచి కూడా బయటపడుతున్నారు. దివ్య వెళ్లిపోవడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పొచ్చు. ఆయన తనూజతోనూ గొడవలకు రెడీ అవుతున్నారు. ఇదంతా భరణి స్ట్రాటజీ అని తెలుస్తోంది. నాగబాబు చెప్పడం వల్లే తాను స్ట్రాటజీ మార్చుకున్నట్టు, తన అసలు రూపాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది.