Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌

Published : Dec 05, 2025, 06:22 PM IST

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అకీరా ఇప్పటికే ఓ సినిమా చేశాడు. అదేంటో చూద్దాం. 

PREV
16
పియానోలో ఎక్స్ పర్ట్ అకీరా నందన్‌

పవర్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, తన మాజీ భార్య రేణు దేశాయ్‌లకు అకీరా నందన్‌, ఆధ్యలు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అకీరా నందన్‌ ఏజ్‌ 21ఏళ్లు. హైయ్యర్‌ స్టడీస్‌ చేస్తూ, మరోవైపు మ్యూజిక్‌ లో శిక్షణ పొందుతున్నాడు. పియానో బాగా వాయిస్తాడట. తన కాలేజీలో పర్‌ఫెర్మ్‌ కూడా చేశాడు. అప్పట్లో ఆ వీడియో క్లిప్‌ వైరల్‌గా కూడా మారింది.

26
అకీరా హీరోగా ఎంట్రీ కోసం ప్లాన్‌

ఇటీవల పవన్‌ నటించిన `ఓజీ`లోనూ అకీరా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది జరగలేదు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలున్నాయి. అయితే అకీరాని హీరోని చేయాలని తల్లి రేణు దేశాయ్‌ భావిస్తుంది. అకీరా ఇష్టం కోసం, ఆయన చెప్పే మాట కోసం వెయిట్‌ చేస్తుంది. ప్రస్తుతం యాక్టింగ్‌ పరంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో క్లారిటీ లేదు. అకీరాని రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయం చేస్తారని, పలువురు బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజెస్‌ పోటీ పడుతున్నాయని టాక్‌.

36
బాలనటుడిగా అకీరా నందన్‌ ఎంట్రీ

ఇదిలా ఉంటే అకీరా నందన్‌ ఇప్పటికే ఓ సినిమా చేశాడు. బాల నటుడిగా మెప్పించారు. పదేళ్ల క్రితమే ఆయన వెండితెరపై మెరిశారు. కానీ మన తెలుగు ఆడియెన్స్ కి తెలియదు. ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ వెల్లడించింది. ఆమె మరాఠీలో ఓ సినిమా చేసింది. `ఇష్క్‌ వాలా లవ్‌` పేరుతో అన్నీ తానై రూపొందించింది. ఈ సినిమాకి రైటర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ తనే కావడం విశేషం. అకీరా ఫిల్మ్ పతాకంపై తాను నిర్మించగా, శ్రీ ఆధ్య ఫిల్మ్స్ పతాకంపై డిస్ట్రిబ్యూట్‌ చేసింది.

46
మరాఠీలో రేణు దేశాయ్‌ `ఇష్క వాలా లవ్‌` మూవీ

మరాఠీలో రూపొందిన ఈ చిత్రంలో కొత్త వాళ్లు నటించారు. అదినాథ్‌ కొఠారే, సులగ్నా పాణిగ్రహి, సుచిత్ర బండేకర్‌, లీనా భగవత్‌ వంటి వారు నటించారు. ఇందులో బాలనటుడిగా అకీరా కనిపిస్తాడు. సినిమాలో ఓ పదేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. అందుకోసం చాలా మంది అబ్బాయిల్ని చూసిందట రేణు దేశాయ్‌. ఎవరూ సెట్‌ కాలేదు. దీంతో అకీరా అయితే బాగుంటుందని భావించిందట. పైగా తాను మొదటిసారి దర్శకత్వం వహించిన మూవీలో, తన కొడుకు నటుడిగా పరిచయం అయితే బాగుంటుందని భావించి, అకీరాని తీసుకుందట.

56
అకీరా ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్‌

దీనిపై రేణు దేశాయ్‌ స్పందిస్తూ, నా కొడుకు పరిచయ చిత్రం నా దర్శకత్వంలో రూపొందే మూవీ కావడం తల్లిగా నాకు ఆనందమేగా. అందుకే వాడిని అడిగా, చేస్తా అన్నాడు. వెంటనే వాళ్ల నాన్న(పవన్‌ కళ్యాణ్‌)కు ఫోన్‌ చేసి చెప్పాను. `ఏంటీ వాడితో చేయిస్తున్నావా` అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు. అకీరా చాలా బాగా చేశాడు. అందరు బాగా చేశాడని అంటుంటే, అమ్మగా చాలా ఆనందంగా అనిపిస్తోంది. హీరోయిన్‌ కాంబినేషన్‌లో సీన్‌ అది. చెప్పింది, చెప్పినట్టుగా చేసేశాడు. డబ్బింగ్‌ చెప్పేడప్పుడు మాత్రం నాకు కాస్త టెన్షన్‌ అనిపించింది. ఎలా చెబుతాడో అని, కానీ సీన్‌ పేపర్‌ తీసుకొని సీరియస్‌గా స్క్రీన్‌ని చూస్తూ టకాటకా డబ్బింగ్ చెప్పేశాడు. అప్పుడు అనిపించింది వాడి రక్తంలోనే నటన ఉంది కదా` అని తెలిపింది రేణు దేశాయ్‌. ఈ సినిమా విడుదల సమయంలో రేణు దేశాయ్‌ సాక్షి పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.

66
క్యూట్‌ లుక్‌లో ఆకట్టుకున్న అకీరా

`ఇష్క్‌ వాలా లవ్‌` మూవీ 2014 అక్టోబర్‌ 10న విడుదలైంది. రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. జస్ట్ యావరేజ్‌గా ఆడినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌తో అకీరా నందన్‌ సీన్లు ఉంటాయి. పార్క్ లో హీరోయిన్‌ డల్‌గా ఉన్నప్పుడు అకీరా ఎంట్రీ ఇచ్చి ఆమెతో మాట్లాడి రిలీఫ్‌ చేసే సీన్ లో అకీరా కనిపిస్తాడు. నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర ఇంపాక్ట్ చాలానే ఉంటుంది. అకీరా కూడా చాలా ఈజీగా నటించడం విశేషం. ఇందులో క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు అకీరా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories