తనూజ, దివ్యల మధ్య భరణి సాండ్‌విచ్‌, మళ్లీ సేఫ్‌ గేమ్‌.. ఒంటరైపోయిన ప్రేమ పక్షులు

Published : Nov 07, 2025, 11:45 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 శుక్రవారం ఎపిసోడ్‌లో రెండు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. దివ్య, తనూజల మధ్య భరణి సాండ్‌విచ్‌ కావడం, సుమన్‌ శెట్టి కోసం సంజనా, తనూజ పోటీ పడటం ఆసక్తికరంగా మారాయి. 

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 9.. శుక్రవారం ఆసక్తికర సంఘటనలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 61రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం తొమ్మిదో వారం రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. షోలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి. బంధాలు తెగిపోతున్నాయి. సేఫ్‌గేమ్‌ నుంచి కంటెస్టెంట్లు బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌ దూరంగా ఉంటున్నారు. మరోవైపు తనూజ, భరణిల మధ్య బాండింగ్‌ కూడా తెగిపోతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

26
దూరంగా ఉంటున్న పవన్‌, రీతూ

ఈ ఎపిసోడ్‌లో రీతూ, పవన్‌ కాస్త దూరంగా ఉంటూ కనిపించారు. ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. దీంతో ఈ ఇద్దరిపై రాము రాథోడ్‌, ఇమ్మాన్యుయెల్‌ సెటైర్లు పేలుస్తూ నవ్వులు పూయించారు. సైలెంట్‌గా ఉండే రాము రాథోడ్‌ కూడా పంచ్‌లతో రెచ్చిపోయాడు. దీనికితోడు ఇమ్మాన్యుయెల్‌ వేసిన సెటైర్లు మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఒంటరైన పక్షి అంటూ డీమాన్‌ పవన్‌పై వేసిన పంచ్‌ హైలైట్‌గా నిలిచింది. రీతూ కూడా ఇందులో ఇన్‌ వాల్వ్ కావడం, దాన్ని ఎంజాయ్‌ చేయడం విశేషం.

36
పదో వారం కెప్టెన్సీ టాస్క్

అనంతరం బిగ్‌ బాస్‌ పదవ వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. అందుకోసం రెండు ట్రైన్లు ఎక్కాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ సీట్‌ సంపాదించిన వాళ్లు తమ ట్రైన్‌లో ఎక్కిన వారిలో ఒకరిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. మొదట డ్రైవింగ్‌ సీట్‌ సంపాదించిన రాము రాథోడ్‌ భరణిని తొలగించాడు. ఆ తర్వాత రెండోసారి డ్రైవర్‌ సీట్‌ సంపాదించిన శ్రీనివాస సాయి దివ్యని తొలగించాడు. నిఖిల్‌ సుమన్‌ శెట్టిని తొలగించాడు. ఆ తర్వాత సీట్‌ సంపాదించిన దివ్య.. తనూజని తొలగించింది. దీంతో తనూజ రెచ్చిపోయింది. భరణి కారణంగానే తనని తొలగిస్తున్నావని, పర్సనల్‌గా కక్షపెట్టుకుని ఇప్పుడు చూపిస్తున్నావని ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనూజని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించడంతో తనూజ ఏడ్చుకుంటూ వెళ్లింది. అంతేకాదు తాను వాళ్ల మధ్యలోకి వెళ్లడం లేదని వాపోయింది. దివ్య అన్ని టాస్క్ లు భరణి సపోర్ట్‌ తోనే ఆడుతుంది, సొంతంగా ఆమె గేమ్స్ ఆడటం లేదని చెప్పింది. ఇంతలో రీతూ, భరణి, మిగిలిన కంటెస్టెంట్లు వచ్చి తనూజని ఓదార్చే ప్రయత్నం చేశారు.

46
భరణిని నిలదీసిన దివ్య.. మళ్లీ సేఫ్‌ గేమ్‌

ఇందులో భాగంగా తనతో వాదన జరుగుతుంటే భరణి పేరు ఎందుకు తీసుకు రావాల్సి వచ్చిందనేది భరణిని ప్రశ్నించింది దివ్య. ఈ విషయంలో మీరు స్టాండ్‌ తీసుకోవాలని తెలిపింది. తాను అందుకు నో చెప్పాడు భరణి. మీరిద్దరు గొడవ పడుతుంటే అందులో తాను ఎందుకు స్టాండ్‌ తీసుకుంటాను అని, ఆ తర్వాత ఆమెతో మాట్లాడతానని తెలిపారు. ఈ విషయంపై దివ్య.. భరణి తప్పు అని, ఆయన స్టాండ్‌ తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. భరణి సేఫ్‌గేమ్‌ ఆడుతున్నాడనే విషయాన్ని జనాలకు అర్థయ్యేలా చెప్పింది దివ్య.

56
రెండో సారి కెప్టెన్‌గా ఇమ్మాన్యుయెల్‌

ఈ టాస్క్ లో చివరికి రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌ మిగిలారు. వీరి మధ్య కౌంట్‌ టాస్క్ జరిగింది. ఇమ్మాన్యుయెల్‌ ఫస్ట్ కౌంట్‌ చేసి విన్నర్‌గా నిలిచారు. దీంతో ఇమ్మూ మరోసారి కెప్టెన్‌ అయ్యారు. అంతకు ముందు వారం కూడా అతనే కెప్టెన్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి తను కెప్టెన్‌ అయ్యారు. డీమాన్‌ పవన్‌ తర్వాత ఈ సీజన్‌లో రెండో సారి కెప్టెన్‌ అయిన కంటెస్టెంట్‌గా ఇమ్మూ నిలవడం విశేషం.

66
ఎన్ని జన్మలైనా సుమనే నా మొగుడు

ఇందులో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనూజ, దివ్యల మధ్య భరణి సాండ్‌విచ్‌ అయిపోతున్నాడంటూ సంజనా కామెంట్‌ చేసింది. ఇది క్రేజీగా మారింది. దీనిపై తనూజ స్పందిస్తూ, ఆయన కాదు దివ్య, భరణిల మధ్య తాను సాండ్‌విచ్‌ అవుతున్నానని తనూజ వాపోయింది. మరోవైపు ఈ సీరియస్‌ నెస్‌ నుంచి బయటపడేందుకు సంజనా, తనూజ, సుమన్‌ శెట్టిలు కలిసి చిన్న స్కిట్‌ ప్రదర్శించారు. సుమన్‌ పెళ్లి కొడుకు, సంజనా, తనూజ ఆయన కోసం గొడవపడటం, నన్ను పెళ్లి చేసుకుంటావన్నావ్‌, మోసం చేశావా అని తనూజ వెంటపడటం, ఆ తర్వాత నన్నుపెళ్లి చేసుకుంటావ్‌ అన్నావుగా అని సంజనా రావడం, ఇద్దరు కలిసి సుమన్‌ని చుట్టముట్టడం నవ్వులు పూయించింది. ఫస్ట్ మీ ఇద్దరు ఫిక్స్ అవ్వండి, ఆ తర్వాత తన వద్దకు రండి అని సుమన్‌ అనగా, నేను ఎప్పుడో ఫిక్స్ అని, ఈ జన్మలో, వచ్చే జన్మలో, ఆ వచ్చేజన్మలో కూడా నువ్వే నా మొగుడు అని సంజనా చెప్పడం అదిరిపోయింది. ఎక్స్ ట్రా కట్‌లో వచ్చిన ఈ సీన్ నవ్వులు పూయించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories