
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముందుగా ఊహించిన కంటెస్టెంట్లే హౌజ్‌లోకి ఎంట్రీ ఇచారు. అందులో భాగంగా ఎనిమిదో కంటెస్టెంట్‌గా సోషల్ సోషల్‌మీడియా సెన్సేషన్ రీతూ చౌదరీ ఎంట్రీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో గ్లామర్ ఫోటోలతో దుమ్మురేపే రీతూ చౌదరీ బిగ్ బాస్ లోకి రావడంతో హౌజ్‌లో గ్లామర్ కి కొదవలేదని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ లోకి డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది రీతూ చౌదరీ. తనదైన డాన్సులతో ఉర్రూతలూగించింది.
తనకు నోటి దూల ఎక్కువ అని, మైండ్‌లో ఏదుంటే అదే మాట్లాడతానని, దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పింది. అదే సమయంలో బిగ్ బాస్‌హౌజ్‌లోకి వెళ్లాక ఆ నోటి దూల తగ్గించుకుంటానని చెప్పింది. మరి రీతూ చౌదరీ ఎవరు? గతంలో ఏం చేసిందో తెలుసుకుంటే. రీతూ చౌదరీ టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా చేసిన `పెళ్లి చూపులు` షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. `గోరింటాకు`, `సూర్యవంశం`, `ఇంటిగుట్టు` సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇవి ఆమెకి మంచి పేరుని తెచ్చాయి.
దీంతోపాటు సినిమాల్లోనూ నటించింది రీతూ చౌదరీ. `మౌనమే ఇష్టం` సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలతో మెరిసింది. నవ్వులు పూయించింది. అయితే జబర్దస్త్ లో కమెడియన్‌గా సెట్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఆమె `సరిగమప` షోలో సింగర్ యశస్వి పాట పాడగా, ఆ పాటకి ఫిదా అయిపోయి స్టేజ్‌మీదనే హగ్ చేసుకుని షాకిచ్చింది. ఈ ఘటనతో సంచలనంగా మారింది రీతూ చౌదరీ. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ఇంటర్వ్యూలిచ్చింది. మరింత పాపులర్ అయ్యింది. ఇదే ఆమెకి `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`షోస్‌లో పాల్గొనే అవకాశం తెచ్చిపెట్టింది. దీంతోపాటు `దావత్` పేరుతో హోస్ట్ గా మారి టాక్ షో చేసింది. చాలా బోల్డ్ షోగా ఇది గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో గ్లామర్ సెన్సేషన్‌గా మారిన రీతూ చౌదరీ ఆ మధ్య రూ.700కోట్ల స్కామ్‌లో ఇరుక్కుంది. ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్‌లో రీతూ చౌదరి పేరు వినిపించింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. మాజీ సీఎం వైఎస్‌జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు వినిపించాయి.
రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై రీతూ భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. `మొదటి నుంచి టాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నాం.. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించుకున్నవి, నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం` అని అన్నారు శ్రీకాంత్. ఆ తర్వాత రీతూ చౌదరీ స్పందిస్తూ ఈ ఆస్తుల గురించి తనకు తెలియదని తెలిపింది. ఇదిలా ఉంటే రీతూ చౌదరీ అసలు పేరు వనం దివ్య. ఆ పేరుతోనే ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. అయితే బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు నాగార్జున `దివ్య` అని పిలవగా, ఆ పేరంటే నాకునచ్చదని, అలా పిలవొద్దు అని తెలిపింది రీతూ.