Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా

Published : Sep 29, 2026, 07:55 PM IST

‘మిస్టర్ బచ్చన్’, ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్న భాగ్యశ్రీ బోర్సే.. ‘లెనిన్’ సినిమాతో తొలి విజయాన్ని అందుకుని టాలీవుడ్‌లో తన కెరీర్‌కు మంచి బ్రేక్ అందుకుంది.

PREV
15
భాగ్యశ్రీ బోర్సే

భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నా, కెరీర్‌కు సరైన బ్రేక్ మాత్రం ఆలస్యంగానే వచ్చింది. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే భాగ్యశ్రీ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన రావడంతో అవకాశాలు మాత్రం కొనసాగాయి.

25
వరుస ఫ్లాపులు

వరుసగా ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాల్లోనూ భాగ్యశ్రీ నటించింది. విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’, రామ్ పోతినేని, ఉపేంద్ర కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలు కూడా ఆమెకు ఆశించిన కమర్షియల్ సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తున్నా హీరోయిన్‌గా తన స్థాయిని మరింత పెంచుకునే హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు.

35
తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

అదే సమయంలో భాగ్యశ్రీ చేసిన ‘కాంతా’ సినిమా కూడా ఆమె కెరీర్‌లో ముఖ్యమైన అడుగుగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రంతో ఆమె తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో పాటు ముందుగా చేసిన ప్రాజెక్టుల ద్వారా నటిగా గుర్తింపు వచ్చినా, కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పే విజయం మాత్రం రాలేదు.

45
‘లెనిన్’తో మారిన పరిస్థితి

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే భారతి పాత్రలో కనిపించింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆమెకు చివరకు మంచి విజయాన్ని అందించింది. ‘లెనిన్’ విజయంతో పాటు భారతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలు కూడా భాగ్యశ్రీకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ సక్సెస్ తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమని ఆమె స్వయంగా చెప్పింది.

55
భాగ్యశ్రీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో కొత్త దశ మొదలైనట్లైంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాల తర్వాత వచ్చిన ‘లెనిన్’ విజయంతో హీరోయిన్‌గా తనకు కావాల్సిన కమర్షియల్ బ్రేక్ దక్కింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘సెయోన్’ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. గ్లామర్ పరంగా భాగ్యశ్రీ కి తిరుగులేదు. తాజాగా ఆమె వైట్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో భాగ్యశ్రీ చందమామలా వెలిగిపోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories