ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అద్భుతమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన అనుభూతులతో తెరకెక్కుతున్న ‘ఎమో ఎమో ఇది’ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.