Intinti Gruhalakshmi: ప్లేట్ ఫిరాయించిన భాగ్య.. రాజ్యలక్ష్మి తల పగలగొట్టిన దివ్య!

Published : May 29, 2023, 08:59 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అత్తింటి సమస్యలను తెలివిగా ఎదుర్కొంటున్న ఓ కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Intinti Gruhalakshmi: ప్లేట్ ఫిరాయించిన భాగ్య.. రాజ్యలక్ష్మి తల పగలగొట్టిన  దివ్య!

 ఎపిసోడ్ ప్రారంభంలో ఒక వ్యక్తిని మంచివాడు అని ప్రూవ్ చేయడానికి కష్టపడాలి కానీ చెడ్డవాడు అని ప్రూవ్ చేయడానికి ఒక్క థంబ్ నైల్ చాలు అంటాడు సోషల్ మీడియా వ్యక్తి. అతని చేతిలో కొంత డబ్బు పెట్టి పని అయిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తాను అంటుంది లాస్య. సీన్ కట్ చేస్తే కేఫ్లో ఉన్న నందు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటాడు.
 

29

 ఇంట్లో ఉంటే కేసు గురించి ఆలోచిస్తున్నారు అందుకే మిమ్మల్ని ఎప్పటినుంచో కెఫేకి వెళ్ళమని చెప్తున్నాను అంటుంది తులసి. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఓ కష్టమర్ అనుమానంగా చేస్తూ ఉంటుంది. తన ఫోన్లో ఒక వీడియో చూపించి ఈ వీడియోలో ఉన్న వ్యక్తి అతనే కదా అని తను ఫ్రెండ్ ని అడుగుతుంది. అవును అంటాడు ఆ వ్యక్తి. నందు ని పిలిచి భార్యని కొట్టడం ఏంటి కాస్తయినా బాధ్యత ఉండక్కర్లేదా అని అడుగుతుంది.

39

పక్కనే ఉన్న తులసి తో మీరేనా తులసి అంటే మీ వల్లే లాస్య  కాపురం కూలిపోతుంది అంటూ నిష్టూరంగా  మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటాడు నందు. వీడియో చూపిస్తుంది కస్టమర్. వీళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు ఇక్కడ ఉండటం మనకు కూడా మంచిది కాదు అంటూ అక్కడ ఉన్న కస్టమర్లు అందరినీ బాయ్ కాట్ చేయమని చెప్తుంది  ఆ కస్టమర్.  నిజం తెలియకుండా మాట్లాడొద్దు అని నందు ఎంత చెప్పినా వినిపించుకోరు కస్టమర్స్. ఇలా ఎవరు చేసి ఉంటారు అని అంటాడు నందు.
 

49

ఇంకెవరు నేనే అంటూ అక్కడికి వస్తుంది లాస్య. నాతో పెట్టుకుంటే నష్టపోయేది నందుయే అంటూ తులసి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజ్యలక్ష్మి కాలికి కట్టు విప్పి నూనె మర్దనా చేస్తుంది దివ్య. చాలా రేష్ గా మసాజ్ చేస్తూ ఉంటుంది. అది కాలనుకున్నావా  పిండి ముద్దనుకున్నావా అంటూ మందలిస్తాడు బసవయ్య. నేను డాక్టర్ని మీకు అంత ఇబ్బందిగా ఉంటే ముందు మీరు ఇక్కడనుంచి బయటికి వెళ్ళండి అని కసురుకుంటుంది దివ్య.
 

59

 బసవయ్య వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాధ చూడలేకపోతున్నాను ఇంక చాలు మర్దన ఆపు అంటాడు విక్రమ్. మీ అమ్మగారి కాలు బాగావ్వాలా.. వద్దా? అంత చూడలేకపోతే మీరు కూడా బయటికి వెళ్ళండి అనటంతో విక్రమ్  కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా అందరూ నిన్ను నాకు వదిలేసి వెళ్ళిపోయారు. నా చేతికి ఇంత త్వరగా చిక్కుతావనుకోలేదు అంటూ కాలుని విరిచేలాగా మర్దనా చేస్తుంది దివ్య.
 

69

రేపటికల్లా నడిచేలాగా చేస్తాను అలా కుదరకపోతే ఎడంకాలు విరిచి కుడి చేతిలో పెడతాను అంటూ అత్తకి చుక్కలు చూపిస్తుంది దివ్య. మరోవైపు ఇంటికి వచ్చిన భాగ్యాన్ని నానా చివాట్లు పెడతారు పరంధామయ్య దంపతులు. తనని నేనే రమ్మన్నాను తన భర్త సస్పెన్షన్ లో ఉన్నాడు చాలా కష్టం లో ఉంది లాస్య వేసే చిల్లర డబ్బులు కి కక్కుర్తి పడుతుంది. అయినా నీకు కష్టం అనిపించినప్పుడు నాతో ఒక మాట చెప్పాలి కదా నేను సాయం చేసేదాన్ని కదా అంటూ సస్పెన్షన్ ఆర్డర్ ని రద్దు చేసిన లెటర్ భాగ్య చేతిలో పెడుతుంది.
 

79

 నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో సస్పెన్షన్ రద్దు చేశాను ఇది నీ నుంచి ఏదో ఆశించి చేసింది కాదు నువ్వు బాగోవాలని, మీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలని ఆలోచించే మనిషిని నేను అంటుంది తులసి. భాగ్యలో మార్పు వస్తుంది. తలుపుచేసిన సాయానికి కన్నీరు పెట్టుకొని నేను నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నువ్వు నా మంచే కోరుకున్నావు అంటూ తులసికి థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లాస్య నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేస్తుంది.
 

89

 మరోవైపు దివ్య తన తల బద్దలు కొట్టినట్లుగా కలకంటుంది రాజ్యలక్ష్మి. కంగారుపడి నిద్రలేచి నాకేంటి ఇలాంటి కల వచ్చింది నేను దివ్య కి భయపడుతున్నానా అనుకుంటుంది. మరోవైపు తులసికి ఫోన్ చేస్తుంది భాగ్య . ఏమైనా పని ఉందా అని అడుగుతుంది తులసి. ఒకప్పుడు పని ఉంటేనే ఈ భాగ్యం ఫోన్ చేసేది కానీ ఇప్పుడు భాగ్యం మారిపోయింది. నా సంసారాన్ని రోడ్డున పడకుండా ఆదుకున్నావు ఉంటుంది భాగ్య.

99

 తరువాయి భాగంలో లాస్యని ఫోన్లో వీడియో చూపించమంటుంది తులసి. తన ఫోన్లో వీడియో లేకపోవడం చూసి కంగారు పడుతుంది లాస్య. కోర్టులో సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయమంటారు జడ్జిగారు. తన ఫోన్ ఇచ్చి వీడియో చూడమంటుంది లాస్య. కంగారుపడుతుంది తులసి.

click me!

Recommended Stories