హనియా అమీర్ ఒక పాకిస్తానీ సినిమా, టెలివిజన్ రంగంలో నటిగా రాణిస్తున్నారు. ఆమె మోడల్, గాయని. హనియా అమీర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అద్భుతమైన లుక్స్ , నటనతో ప్రసిద్ధి చెందిన సజల్ అలీ, అనేక హిట్ చిత్రాలలో పనిచేశారు. ఆమె గ్లామర్ కి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు.
అందానికి పేరుగాంచిన మాయ, ప్రముఖ నాటకాలు, సినిమాల్లో తన పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
పాపులర్ నటి, మోడల్ మెహవిష్ హయత్ అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనకు చాలా అవార్డులు వచ్చాయి.
పాకిస్తాన్ పాపులర్ నటీమణుల్లో ఒకరైన సబా కమర్ నటి, టీవీ హోస్ట్ కూడా.బుల్లితెర అభిమానులని ఆమె తన అందంతో కట్టి పడేస్తుంది.
పాకిస్తానీ డ్రామా ఇండస్ట్రీలో పాపులర్ నటి ఆయిజా ఖాన్ తన అందానికి ఫేమస్.ఆమె క్రేజీ లుక్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.
'హమ్సఫర్'లో తన పాత్రతో పాపులర్ అయిన మహిరా ఖాన్ నటనకు అందరూ ఫ్యాన్స్. మహీరా బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించారు.
తన అద్భుతమైన నటనా నైపుణ్యాలకు పేరుగాంచిన సారా, ప్రముఖ టెలివిజన్ నాటకాల్లో తన పాత్రలకు పేరు సంపాదించుకుంది.
నటి, మోడల్ నీలం మునీర్ తన అందానికి గుర్తింపు పొందింది. ఆమె చాలా హిట్ డ్రామా షోలలో నటించింది.నటన, గ్లామర్ లుక్స్ తో ఆమె ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది.
వీణా మాలిక్ తన బోల్డ్ స్టైల్ కు పేరుగాంచింది. పాకిస్తాన్, ఇంటర్నేషనల్ స్థాయిలో తన పేరును సంపాదించింది.
Tirumala Dornala