2021లో ఒక ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ ఇవే.. 'భూమ్ బద్దల్ నుంచి 'ఊ అంటావా' వరకు

First Published | Dec 13, 2021, 9:52 AM IST

కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. సినిమాని మాస్ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఐటెం సాంగ్ ని ఒక ట్రిక్ లాగా వాడుతుంటారు. 2021లో టాలీవుడ్ ప్రేక్షకులని ఊపేసిన ఐటం సాంగ్స్, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో Item Songs ట్రెండ్ బాగా కొనసాగుతోంది. సినిమాని మాస్ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఐటెం సాంగ్ ని ఒక ట్రిక్ లాగా వాడుతుంటారు. 2021లో టాలీవుడ్ ప్రేక్షకులని ఊపేసిన ఐటం సాంగ్స్, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

క్రాక్ -భూమ్ బద్దల్ : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది Krack చిత్రంతో మాస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులని అంతగా అలరించిందో అదే స్థాయిలో ఈ మూవీలోని భూమ్ బద్దల్ అనే ఐటెం సాంగ్ థియేటర్స్ ని కుదిపేసింది. నటి అప్సర రాణి తన ఎనెర్జిటిక్ స్టెప్పులతో, గ్లామర్ తో మతిపోగొట్టేసింది. తమన్ ఈ సాంగ్ కి రీసౌండింగ్ మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. 


రెడ్ - డించాక్ : రామ్ నటించిన రెడ్ మూవీ జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ ఈ మూవీలో కుర్ర బ్యూటీ హెబ్బా పటేల్ పెర్ఫామ్ చేసిన డించాక్ అనే ఐటెం సాంగ్ ని మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ సాంగ్ లో రామ్, హెబ్బా పటేల్ స్టెప్పులు కిక్కిచ్చేలా ఉంటాయి. 

బ్లాక్ రోజ్- నా తప్పు ఏమున్నదబ్బా : బాలీవుడ్ శృంగార తార ఊర్వశి రౌతేలా 'బ్లాక్ రోజ్' చిత్రంతో త్వరలో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని 'నా తప్పు ఏమున్నదబ్బా' స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటలో ఊర్వశి అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తోంది. ఈ సాంగ్ కి మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.

గల్లీ రౌడీ- చాంగురే :  సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ చిత్రంలో నటి స్నేహ గుప్త ఐటెం సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. మంగ్లీ తన ఎనెర్జిటిక్ వాయిస్ తో పాడిన ఈ పాటలో స్నేహ గుప్త ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. నాజూకైన అందాలతో మత్తెక్కించే స్టెప్పులతో ఒక ఊపు ఊపింది. భాస్కర బట్ల ఈ పాటకు లిరిక్స్ అందించారు. 

చావు కబురు చల్లగా - పైన పటారం : టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ హీరో కార్తికేయతో కలసి చావు కబురు చల్లగా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. రెడ్ శారీలో అనసూయ తన డాన్స్ తో అలరించింది. ఈ పాటని పాడింది కూడా మంగ్లీనే. 

అల్లుడు అదుర్స్ - రంభ ఊర్వశి మేనక: బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ రంభ ఊర్వశి మేనక అంటూ చిందులేసింది. ఈ ఐటెం సాంగ్ లో మోనాల్ ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఐటెం సాంగ్ మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

సీటీ మార్ - పెప్సీ ఆంటీ: ఐటెం బ్యూటీ అప్సర రాణి ఈ ఏడాది పెర్ఫామ్ చేసిన మరో ఐటెం సాంగ్ 'పెప్సీ ఆంటీ'. గోపీచంద్ సిటీమార్ చిత్రంలోని ఈ సాంగ్. 'నా పేరే పెప్సీ ఆంటీ' అంటూ అప్సర రాణి గ్లామర్ ఒలకబోసింది. ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన సీటీమార్ మూవీ పర్వాలేదనిపించింది. 

శ్రీదేవి సోడా సెంటర్ - మందులోడా : నటి స్నేహ గుప్త పెర్ఫామ్ చేసిన మరో ఐటెం సాంగ్ 'మందులోడా'. సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలోని ఈ స్పెషల్ నంబర్ జానపద తరహాలో సాగుతూ అలరించింది. సుధీర్ బాబు, స్నేహ గుప్త ఇద్దరూ  ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులతో అలరించారు. 

పుష్ప - ఊ అంటావా : అల్లు అర్జున్, సమంత అభిమానులంతా ప్రస్తుతం ఎదురుచూస్తున్నది ఈ ఐటెం సాంగ్ కోసమే. సమంత తన కెరీర్ లో తొలి సారి చేసిన ఐటెం సాంగ్ ఇది. ఇప్పటికే లిరికల్ వీడియోలో సౌత్ ఇండియాలోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ పై క్రేజ్ ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. Also Read: Pushpa:పుష్ప ప్రీ రిలీజ్ లో అనసూయ వైరల్ కామెంట్, వెంటనే కవరింగ్.. రెడ్ హాట్ లుక్ లో మెరుపులు

Latest Videos

click me!