Pushpa:పుష్ప ప్రీ రిలీజ్ లో అనసూయ వైరల్ కామెంట్, వెంటనే కవరింగ్.. రెడ్ హాట్ లుక్ లో మెరుపులు

First Published | Dec 13, 2021, 7:56 AM IST

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక తన గ్లామర్, క్యూట్ స్పీచ్ తో మనసులు దోచేసింది. రష్మిక తర్వాత గ్లామర్ పరంగా ప్రీ రిలీజ్ వేడుకలో హైలైట్ అయింది మాత్రం అనసూయనే. మతిపోగొట్టేలా రెడ్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 


Anasuya రెడ్ డ్రెస్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప చిత్రంలో అనసూయ ద్రాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ పుష్ప మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉండగా పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ ఒక ఆసక్తికర కామెంట్ చేసింది. ఆమె కామెంట్ వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఇంతకీ అనసూయ చేసిన కామెంట్ ఏంటంటే.. మీతో నటించాలని ఉందని అల్లు అర్జున్ గారిని కోరాను. వెంటనే వారంలోనే నాకు పుష్ప చిత్రంలో ఛాన్స్ వచ్చింది అని అనసూయ తెలిపింది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతోందంటే నేను బన్నీని ఇంకా చాలా అడగాలి అనేసింది. దీనికి  బన్నీతోపాటు అక్కడున్న వారు ముసిముసి నవ్వులు నవ్వారు. 

వెంటనే అనసూయ సినిమాలో ఛాన్సులు అడగాలి అంటూ కవర్ చేసింది. ఇక నా గ్లామర్ ఎలాగు టివిలో చూస్తున్నారు కదా.. సినిమాల్లో మాత్రం ఎలాంటి రోల్స్ తో సర్ ప్రైజ్ చేయాలని కంకణం కట్టుకున్నా అని అనసూయ తెలిపింది. 

ఇక పుష్ప ది రైజ్ లో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ మధ్య వేదికపై సరదా ముచ్చట్లు జరిగాయి. ఫ్యూచర్ లో సునీల్ గారితో చాలా సినిమాల్లో నటించబోతున్నాను అంటూ అనసూయ వేదికపై హింట్ ఇచ్చింది. 

పుష్పలో సునీల్ మంగళం శ్రీనుగా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ పాత్రలు పుష్ప మూవీలో చాలా కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ ని నెవర్ బిఫోర్ అనిపించే విధమా చూపించనున్నారు. అనసూయ పుష్ప ఈవెంట్ లో మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె జబర్దస్త్ షో కోసం బెల్లీ అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 

Latest Videos

click me!