చిన్న సినిమాలే కానీ ప్రేక్షకుల మీద పెద్ద ప్రభావం చూపాయి. గొప్ప అనుభూతిని పంచాయి. సినిమా అంటే ఇది కదా అనేలా తెరకెక్కాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు సౌత్ ప్రతీకగా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన ఈ పది సినిమాలు అద్భుతమైనవి. వీటిని ప్రతి సినిమా లవర్ ఖచ్చితంగా చూడాలి అవేమిటో చూద్దాం...
దర్శకుడు త్యాగరాజన్ తెరకెక్కించిన సూపర్ డీలక్స్ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. సొసైటీలోని వివిధ రకాల మనుషులు, వారి ఇబ్బందులను నాటకీయంగా చెప్పడం జరిగింది. సమంత బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. విజయ్ సేతుపతి, ఫహద్ కీలక రోల్స్ చేశారు.