Sanjay Dutt
సడక్, మున్నా భాయ్ MBBS ఖల్నాయక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ పైనా తన దృష్టిని పెట్టారు. కేజీఎఫ్ 2 లో ఆయన పాత్రకు ఓ రేంజిలో అప్లాజ్ వచ్చింది. రీసెంట్ గా రామ్ , పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా లో కూడా ఆయన పాత్రకు బాగా పేరు వచ్చింది. సినిమా హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా తన పాత్రలను తన నటనతో పండించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు.
సంజయ్ దత్ కు అనేక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి ఏ రోజు కూడా స్పీడ్ తగ్గడం లేదు. కెరీర్ వైజ్ గా సూపర్ స్టార్ గా ఉన్న సంజయ్ దత్, పర్శనల్ లైఫ్ లో మాత్రం చాలా గమ్మత్తైన మనిషి, అనేక వివాదాలు ఎప్పుడూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఆయన పర్శనల్ లైఫ్ నుంచి బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Sanjay Dutt
సంజయ్ దత్ బయోపిక్ సంజు మూవీ 2018లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ఇక సినిమా కూడా బాగుందని మంచి టాక్ వచ్చింది. సంజు లో రణబీర్ కపూర్ తనకు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని చెబుతారు.
దాంతో అప్పట్లో అంతటా ఇదే చర్చ నడిచింది. అయితే ఆ విషయంలో నిజమెంత సినిమా కోసం కల్పించారా అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. అయితే అది నిజమే అంటున్నారు ఆ చిత్రం దర్శకుడు, రచయిత అయిన రాజ్ కుమార్ హిరానీ. అలాగే అంత మందిని ఎలా పడేసేవాడు అనే విషయం గురించి చెప్పుకొచ్చారు.
Sanjay Dutt
సంజయ్ దత్ ఏకంగా 308 మంది అమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనేది షాకింగ్ మేటర్.ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని సంజయ్ దత్ స్వయంగా వెల్లడించడంతో దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తీసిన సంజూ బయోపిక్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే అంత మంది అమ్మాయిలను సంజయ్ ఎలా పడేసేవాడు అని అడగ్గా.. రాజ్‌కుమార్ హిరాణీ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తనకు పరిచయం అయిన అమ్మాయిని తల్లి నర్గిస్ దత్ సమాధి దగ్గరికి తీసుకెళ్లి బాధపడేవాడట.
Sanjay Dutt
దాంతో ఆ అమ్మాయి కరిగిపోయి సంజయ్‌తో ఎఫైర్ పెట్టుకునేవారట. చాలా మంది అమ్మాయిలతో సంజయ్ ఇలాగే చేసి వారితో బెడ్ షేర్ చేసుకున్నారని... రాజ్ కుమార్ హిరాణీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే తన తల్లి అని చెప్పి సానుభూతి సంపాదించే సమాధి అసలు ఆమెదే కాదు..ఎవరిదో ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లి ఇలా చేసేవాడుట.
Sanjay Dutt
తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్.ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఒక కొత్త కారు పార్క్ చేసి ఉంది. సంజయ్ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్ సంబంధాలు నడిపాడని చెప్తారు.
సంజయ్ దత్ జీవితమే ఓ పక్కా కమర్షియల్ సినిమా. ఎందుకంటే సునీల్‌దత్ వారసుడిగా సులువుగా చిత్రసీమలో అడుగుపెట్టడం, తొలి చిత్రం ‘రాకీ'తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న సంజయ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, గెలుపోటములు చవిచూడాల్సి వచ్చింది.
సినిమాల పరంగా మాత్రంగానే కాదు చాలా విషయాల్లో సంజయ్ దత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 1993 ముంబాయి పేలుళ్ళకు సంబంధించిన ఆయుధాల కేసులో దోషిగా నిర్ధారణ కావటంతో 5 సంవత్సరాల శిక్ష పడింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా అతని శిక్షను తగ్గించింది.
సంజయ్ దత్ మొత్తం 42 నెలలు జైలు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛాజీవిగా మారిన సంజయ్ ఇప్పుడు వరస సినిమాలు చేసారు. జచేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే మున్నాభాయ్ సిరీస్‌లోని రెండు చిత్రాలకు కథనందించిన రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సంజు. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రను పోషించారు.