allu aravind, suriya, gajani, ameerkhan
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు అల్లు అరవింద్ (Allu Aravind). వరుస ప్రాజెక్టులతో తరచూ బిజీగా ఉండే ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టు కూడా సూపర్ హిట్ సినిమకు సీక్వెల్ అని, త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం. అలాగే ఈ సినిమా నిమిత్తం ఇద్దరు స్టార్ హీరోలను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
అయితే అరవింద్ కు ఈ ఆలోచన రావటానికి కారణం ప్రస్తుతం ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడవటమే అని తెలుస్తోంది. పాత హిట్ సినిమాల్ని రీమేక్ చేయడం లేదా సీక్వెల్ చేసి తమ ప్రాజెక్టులకు క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ కల్ట్ సీక్వెల్ పై ఆసక్తిరక ప్రకటన చేశాడు హీరో సూర్య. అదే గజిని చిత్రం.
సూర్య కెరీర్ లోనే విలక్షణ చిత్రంగా నిలిచింది ‘గజిని’ సినిమా. అప్పట్లో సౌత్ ను ఓ ఊపు ఊపేసింది ఆ మూవీ. సూర్య కెరీర్ లో పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయిన గజిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు అభిమానులు. 2005 తెలుగులో తనకు మార్కెట్ పెద్దగా లేని టైంలో ఒక్కసారిగా స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఇది. తమిళంలో రికార్డులు మారు మ్రోగాయి. ఏఆర్ మురగదాస్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమా సీక్వెల్ పై చర్చ మొదలైంది.
Allu Aravind
సూర్య మాట్లాడుతూ..“గజిని-2 ఐడియా అల్లు అరవింద్ గారిది. సీక్వెల్ సాధ్యమౌతుందా అని నన్ను అడిగారు. కచ్చితంగా కుదురుతుందని చెప్పాను. చర్చలైతే మొదలయ్యాయి. ప్రస్తుతానికి ప్రాసెస్ లో ఉంది. గజిని-2 వస్తుందనే అనుకుంటున్నాను.” ఇలా తన పైప్ లైన్ లో ‘గజిని-2’ కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టాడు సూర్య. ఇదే సినిమాను అమీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాలీవుడ్ కు వంద కోట్ల క్లబ్ ను పరిచయం చేసింది ఈ సినిమానే.
అమీర్ దీనికి సీక్వెల్ ఎవరైనా రాసుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముచ్చట్లలో చెప్పాడు. సల్మాన్ ఖాన్ సికందర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మురుగదాస్ నెక్ట్స్ ఈ ప్రాజెక్టు చేస్తాడేమో చూడాలి. కంగువ ప్రమోషన్ల కోసం నార్త్ లో టూర్లు చేస్తున్న సూర్య భవిష్యత్తులో గజిని 2 ఉంటుందని, తనను అమీర్ ఖాన్ ను ఒకేసారి స్క్రీన్ మీద చూడొచ్చని చెప్పడం అభిమానులతో పాటు మీడియాకు షాక్ ఇచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఒకేసారి తమిళ్ తో పాటు హిందీలో చేయాలని అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. మధు మంతెనతో కలిసి తమిళ్ లో సూర్యతో, హిందీలో అమీర్ ఖాన్ తో సమాంతరంగా ఈ సినిమా చేయాలని అరవింద్ ఆలోచన.
సినిమాల విషయానికి వస్తే అల్లు అరవింద్ సమర్పణలో ‘తండేల్’ (Thandel) తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) - సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటిస్తోన్న చిత్రమిది. చందు మొండేటి దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితం అవుతుంది.
ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని, సినిమాటిక్‌గా చెబుతున్న కథ ఇది. ‘‘గత ఏడాదిన్నర నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ‘తండేల్’ విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అందుకోసం దర్శకుడు చందు, నటుడు నాగచైతన్యతో టీమ్ అంతా ఎంతో శ్రమించారు. భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నాం’’ అని సినిమా ప్రారంభం రోజు అరవింద్ తెలిపారు.