నాగ చైతన్య, శోభితాల పెళ్లి వేడుక ఈ రోజు(బుధవారం) రాత్రి 8.13గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. శోభితా మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు చైతూ. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. నాగార్జున దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు.
అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీలు సమక్షంలో వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నాగచైతన్య తల్లి లక్ష్మి, శోభితా ఫ్యామిలీ, దగ్గరి బంధువులు, అలాగే సినిమా రంగం నుంచి ప్రభాస్, బన్నీ, చరణ్, వెంకటేష్ రానా వంటి వారు పాల్గొంటారట.