టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ వేడుక తిరుమలలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా శ్రీనివాస్, కావ్య రెడ్డి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని వారాల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ తనకి కాబోయే భార్య కావ్య రెడ్డిని అభిమానులకు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జరిగిన వివాహ వేడుకతో కావ్య రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్ జంట ఒక్కటయ్యారు.
24
బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్స్
బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు రావలసి ఉంది. వివాహానికి ముందు బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
34
నా అదృష్టంగా భావిస్తున్నా
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు ఎంతో ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మా తల్లిదండ్రులు నాకు శ్రీనివాస్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ వస్తున్నాయి. ఇప్పుడు నా పెళ్లి కూడా ఇక్కడే జరగనుండడం నా అదృష్టంగా భావిస్తున్నా.
తిరుమలలో పెళ్లి చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ దృష్టం నాకు దక్కింది. కావ్య అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది. మా పెళ్ళికి కూడా శ్రీవాస కావ్యనామ్ అని పేరు పెట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. మే 1న హైదరాబాద్ లో గ్రాండ్ గా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. శ్రీనివాస్ హీరోగా రాణిస్తుండగా.. కావ్య రెడ్డి ప్రముఖ న్యాయవాది కుమార్తె అని తెలుస్తోంది.