Bellamkonda Srinivas Engagement: బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి ల నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కవ్యా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది.
25
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేడుకలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కవ్యా రెడ్డి జంటగా అందంగా కనిపించడంతో అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
35
పెళ్లి తేదీ కూడా ఖరారైంది
ఈ జంట పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఏప్రిల్ 29, 2026న తిరుమలలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకను సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుమలలో జరగనున్న ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే హాజరుకానున్నారు.
వ్యక్తిగత జీవితంలో ఈ ముఖ్యమైన మలుపు వచ్చిన సమయంలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినీ కెరీర్‌లో కూడా ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల కిష్కింధపురి సినిమాలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత ఆయన మరిన్ని ప్రాజెక్ట్‌లలో నటించనున్నారు.
55
కావ్య రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
బెల్లంకొండ శ్రీనివాస్ కి కాబోయే భార్య కావ్య రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. ఆమె తాత జడ్జి. తండ్రి లాయర్ గా పనిచేస్తున్నారు. మార్చిలో బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డిని అభిమానులకు పరిచయం చేశారు.